Samantha Ruth Prabhu: అదే జరిగితే నేను చాలా అదృష్టవంతురాలిని: సమంత

Samantha Ruth Prabhu: సమంతా తన పెంపుడు పెట్ సాషాతో కలిసి దిగిన ఒక చిత్రాన్ని పోస్ట్ చేసింది. ఆ చిత్రం చూసి ఓ నెటిజన్ తన వ్యాఖ్యల ద్వారా ఇతరులు హర్ట్ అవుతారన్న ఆలోచన లేకుండా పోస్ట్ పెట్టాడు.. దానికి సామ్ ఏ మాత్రం ఫీలవకుండా చాలా కూల్ గా రిప్లై ఇచ్చింది.
వర్కౌట్ డైరీల నుండి సమంత పోస్ట్ చేసిన ఈ చిత్రానికి అనేక లైక్‌లు, కామెంట్‌లు వచ్చినప్పటికీ, ఆమె కూడా ట్రోల్ చేయబడింది. ఒక వినియోగదారు 'పిల్లలు, కుక్కలతో గడుపుతూ ఒంటరిగా చనిపోతారు' అని కామెంట్ పెట్టాడు.
దానికి సమంత అలా జరిగితే 'నేను చాలా అదృష్టవంతురాలిగా భావిస్తాను' అని రిప్లై ఇచ్చింది. అయితే నెటిజన్స్ చేతిలో అతడికి బాగా చీవాట్లు పడ్డాయి. దాంతో అతడు ఆ పోస్ట్ ని డిలీట్ చేశారు.
అయితే ఈలోపే నెటిజన్ లు ఆ వ్యాఖ్యలను స్క్రీన్‌షాట్‌లు తీసి వైరల్ చేస్తున్నారు. సమంతపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఇది వైరల్‌గా మారి ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతోంది.
సమంత దగ్గర రెండు పెట్ డాగ్స్ సాషా, హష్‌లు ఉన్నాయి. షూటింగ్స్ లో బిజీగా ఉన్నా వర్కవుట్స్ చేస్తుంది.. తన పెట్స్ తో ఆడుకుంటుంది. ఇదిలా ఉంటే, సమంత ఇటీవల కాశ్మీర్‌లో విజయ్ దేవరకొండతో కలిసి నటిస్తున్న చిత్రం 'ఖుషి' కోసం దాదాపు 30 రోజుల పాటు షూట్ చేసింది. శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 23న విడుదల కానుంది.
గుణశేఖర్ దర్శకత్వంలో నటించిన పౌరాణిక చిత్రం శాకుంతలం , మరో థ్రిల్లర్ మూవీ యశోద రిలీజ్ కి సిద్ధంగా ఉన్నాయి. స్టార్ ఫిలిప్ జాన్ దర్శకత్వంలో తన మొదటి హాలీవుడ్ చిత్రం అరేంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్ కూడా చేస్తుంది. ఇక బాలీవుడ్ మూవీ సిటాడెల్‌లో వరుణ్ ధావన్‌తో స్క్రీన్‌ను పంచుకోనుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com