Samantha Ruth Prabhu: ఓ దేవదాసి బయోపిక్ కోసం పోటీపడుతున్న సమంత, అనుష్క..

Samantha Ruth Prabhu: టాలీవుడ్‌లో ఒకప్పుడు లేడీ ఓరియెంటెడ్ కథలతో తనకంటూ ఓ మార్క్ క్రియేట్ చేసుకుంది అనుష్క. అనుష్క అడుగుపెట్టిందట.. తన నటన అందరినీ కట్టిపడేయాల్సిందే. అలాంటి అనుష్క ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటోంది. ఇక ఈ గ్యాప్‌లో ఎందరో నటీమణులు అనుష్క ప్లేస్‌ను ఆక్రమించడానికి ప్రయత్నించారు. ప్రస్తుతం ఆ రేంజ్‌లో మళ్లీ క్రేజ్‌ను సంపాదించుకుంది సమంత. అయితే అనుష్క, సమంత ప్రస్తుతం ఓ బయోపిక్ కోసం పోటీపడుతున్నారట.
సమంత క్రేజ్ ఇప్పుడు మామూలుగా లేదు. ఇప్పటివరకూ ప్రేమకథలకే పరిమితమైన సామ్.. తాజాగా ఐటెమ్ సాంగ్స్‌తో తన కెరీర్‌లో కొత్త చాప్టర్ ఓపెన్ చేసింది. అంతే కాకుండా వరుసగా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తూ.. అవి కూడా పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల చేస్తూ చాలా బిజీ అయిపోయింది. ప్రస్తుతం సమంత.. ఓ బయోపిక్ విషయంలో అనుష్కతో పోటీపడుతున్నట్టు టాక్.
'బెంగుళూరు నాగరత్నమ్మ'.. ఈ పేరు ఈతరంలో చాలా తక్కువమందికే తెలుసు. ఓ దేవదాసి అయినా కూడా సంగీతం నేర్చుకొని.. సంగీత ప్రపంచంలో తన పేరును చిరస్మరణీయంగా నిలుపుకున్నారు బెంగుళూరు నాగరత్నమ్మ. అయితే ఈతరం వారికి కూడా ఆమె గురించి తెలియాలని సీనియర్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాస రావు ఓ బయోపిక్ కథను సిద్ధం చేశారట.
సింగీతం శ్రీనివాస రావు రాసుకున్న బెంగుళూరు నాగరత్నమ్మ కథకు అనుష్క అయినా.. సమంత అయినా.. బాగా సూట్ అవుతారని అనుకున్నారట. అందుకే ఈ కథను ఇప్పటికే వీరిద్దరికి చెప్పేశారట. కానీ అనుష్క కానీ, సమంత కానీ ఇప్పటికీ దీనిపై స్పందించలేదని సమాచారం. ఓ దేవదాసి నుండి సంగీతకారిణిగా మారిన బెంగుళూరు నాగరత్నమ్మ కథ ఫైనల్‌గా ఎవరి చేతికి వెళ్తుందో చూడాలి..
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com