Samantha Ruth Prabhu: సమంత బర్త్ డే స్పెషల్.. 'శాకుంతలం' పోస్టర్ రిలీజ్..

Samantha Ruth Prabhu: సమంత బర్త్ డే స్పెషల్.. శాకుంతలం పోస్టర్ రిలీజ్..
X
Samantha Ruth Prabhu: ఈ అందమైన ప్రేమకథలో సమంత సరసన 'దుష్యంతుడిగా' మలయాళ నటుడు దేవ్ మోహన్ నటిస్తున్నాడు.

Samantha Ruth Prabhu: ఈరోజు (ఏప్రిల్ 28) సమంత పుట్టినరోజు. ఈ స్టార్ హీరోయిన్ నేటితో 35వ ఏట అడుగుపెట్టింది. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, సన్నిహితులు సోషల్ మీడియా వేదికగా ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా సమంత నటిస్తున్న తాజా చిత్రం 'శాకుంతలం' పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పోస్టర్ ద్వారా వారు శకుంతలకు బర్త్ డే విషెస్ చెప్పారు. పోస్టర్ సోషల్ మీడియాలో విడుదలైన కొద్దిసేపటికే వైరల్‌గా మారింది.

స్టార్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ 'శాకుంతలం'లో సమంత లీడ్ రోల్ పోషిస్తోంది. మహాభారతం ఆదిపర్వంలోని శకుంతల, దుష్యంతుల ప్రేమకథ వెండితెరపై ఆవిష్కృతం కానుంది. ఈ అందమైన ప్రేమకథలో సమంత సరసన 'దుష్యంతుడిగా' మలయాళ నటుడు దేవ్ మోహన్ నటిస్తున్నాడు. స్టార్ హీరో అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ చైల్డ్ ఆర్టిస్ట్‌గా తెరంగేట్రం చేసింది ఈ చిత్రం ద్వారానే.

ఈ భారీ చిత్రాన్ని దిల్ రాజు ప్రొడక్షన్స్, గుణ టీమ్ వర్క్స్ బ్యానర్‌లపై దిల్ రాజు, నీలిమ గుణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించారు. ఈ సినిమాలో చూపించనున్న వార్ సీన్స్, సమంత లుక్ హైలైట్ గా నిలుస్తాయని టాక్. సమంత తొలిసారిగా పౌరాణిక పాత్రలో కనిపించడం మాస్‌లో ఆసక్తికరంగా మారింది. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరోవైపు నయనతార, సమంత, విజయ్ సేతుపతి కలిసి నటించిన తమిళ చిత్రం 'కాతు వాక్కుల రెండు కాదల్' ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అదే విధంగా మరో విలక్షణ పాత్ర 'యశోద' సినిమా షూటింగ్‌లో సమంత బిజీగా ఉంది. సినిమాలు చేస్తూనే పలు ప్రకటనలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది సమంత.

Tags

Next Story