Samantha Ruth Prabhu: అన్ హ్యాపీ మ్యారేజెస్‌కు మీరే కారణం: సమంత ఆరోపణ

Samantha Ruth Prabhu: సెలబ్రెటీల సరదా చాట్ షో కాఫీ విత్ కరణ్. గత 8 సంవత్సరాలనుంచి ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ షో ఆద్యంతం సరదాగానే సాగినా సెలబ్రెటీలకు సంబంధించి కొన్ని సీరియస్ విషయాలు, పర్సనల్ థింగ్స్ కూడా బయటకు వస్తాయి.. అందుకే ఈ షో అంటే అందరికీ ఆసక్తి. మధ్యలో కొంత కాలం బ్రేక్ తీసుకున్నా.. మళ్లీ అదే ఉత్సాహంతో షోను స్టార్ట్ చేశారు కరణ్ జోహార్.
అయితే ఈసారి బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్ సెలబ్రెటీలను కూడా షోలో పార్టిసిపేట్ చేయించారు.. అలా అవకాశం దక్కించుకున్న హీరో విజయ్ దేవరకొండ అయితే, హీరోయిన్ సమంత కావడం విశేషం. బ్యూటిఫుల్ కపుల్ సామ్, చై ఎందుకు డైవోర్స్ తీసుకున్నారో ఇప్పటి వరకు ఎవరికీ అర్థం కాని విషయం.. ఈ విషయాలేమైనా ఈ షోలో చెప్తుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అభిమానులు.. ఎందుకంటే ఇప్పటి వరకు ఎవరికీ చెప్పనివి, ఎక్కడా లీక్ చేయని విషయాలను రాబట్టడమే ఈ షో ఉద్దేశం.
సీజన్ 7 యొక్క మూడవ ఎపిసోడ్ సోఫాలో అక్షయ్ కుమార్, సమంత రుత్ ప్రభులు కూర్చున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రోమో అభిమానులకు ఆసక్తిని కలిగిస్తోంది. జులై 21న రన్నయ్యే ఈ ఎపిసోడ్ కోసం సమంత ఫ్యాన్స్ వెయిటింగ్. దాంతో ఇప్పుడు ఇది ఉత్తేజకరమైన ఎపిసోడ్‌గా మారబోతోంది.
సమంతకు సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ఎక్కువే. ఆమె తరచుగా తన జీవితంలోని ఆసక్తికర సంఘటనలను పంచుకుంటుంది. ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోలో అక్టోబర్ 2, 2021న నాగ చైతన్య నుండి విడాకులు తీసుకున్న సమంతను కరణ్ పెళ్లికి సంబంధించిన ప్రశ్నలు అడగడం కనిపించింది. ఈ ప్రశ్న అడిగిన కరణ్‌పై సమంత విరుచుకుపడింది. "వివాహాలు సంతోషంగా లేకపోవడానికి మీరే కారణం" అని చెప్పింది. దీంతో ఎవరిని ఉద్దేశించి సమంత ఆమాట అన్నది అని ఫ్యాన్స్ ఆలోచనలో పడ్డారు. ఇక ఇద్దరు మగ నటులను బ్యాచిలర్ పార్టీకి ఆహ్వానించ వలసి వస్తే ఎవరిని ఆహ్వానిస్తావని అడిగారు కరణ్ జోహార్ సమంతని. అప్పుడు ఆమె "రణవీర్ సింగ్.. రణవీర్ సింగ్" అని చెప్పింది.
ఇంకా ఈ ఎపిసోడ్‌లో సమంత నటుడు నాగ చైతన్యతో విడాకుల వెనుక ఉన్న ప్రధాన కారణాల గురించి సుదీర్ఘంగా మాట్లాడింది. వారి వైవాహిక జీవితం, విడాకుల అంశం ఇప్పటి వరకు బహిర్గతం కాకపోవడంతో, ఈ షో చూసేందుకు చాలా ఉత్సాహంగా ఉన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com