Samantha Ruth Prabhu: అలా జరుగుతున్నా కూడా సమంత 'శాకుంతలం' సినిమా చేసింది: నీలిమ గుణ

Samantha Ruth Prabhu: ప్రస్తుతం సమంత ఏం చేసినా చేసినా సెన్సేషనే. అందుకే దర్శక నిర్మాతలంగా పాన్ ఇండియా కథలతో తన దగ్గరకే వస్తున్నారు. సమంత ఒకవైపు సినిమాల్లో బిజీగా ఉంటూనే.. మరోవైపు తన పర్సనల్ లైఫ్‌పై కూడా దృష్టిపెడుతోంది. తాజాగా సమంత అప్‌కమింగ్ మూవీ 'శాకుంతలం' నుండి విడుదలయిన ఫస్ట్ లుక్ ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది. అయితే ఈ సినిమా కోసం సమంత ఎంత కష్టపడిందో ఈ చిత్ర నిర్మాత నీలిమ గుణ బయటపెట్టారు.
సీనియర్ డైరెక్టర్ గుణశేఖర్ కొంతకాలంగా చారిత్రక సినిమాలను తెరకెక్కించడంలో ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే మహాభారతంలోని శకుంతల కథను ప్రేక్షకులకు చెప్పడానికి 'శాకుంతలం' అనే కథను సిద్ధం చేసుకున్నారు. దీనికి సమంతనే బెస్ట్ ఛాయిస్ అనుకొని తనను ఒప్పించారు. ఈ సినిమా కోసం వీరంతా ఎంత కష్టపడ్డారో ఒక్క ఫస్ట్ లుక్ చూస్తే అర్థమయిపోతోంది.
గుణశేఖర్ కూతురు నీలిమ గుణ.. శాకుంతలం సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే సమంత గురించి, శాకుంతలం గురించి పలు ఆసక్తికర విషయాలు బయటపెట్టిన నీలిమ గుణ.. మరోసారి ఆసక్తికర విషయాలను బయటపెట్టింది. శకుంతల పాత్ర కోసం సమంత చాలా కష్టపడిందంటూ నీలిమా చెప్పుకొచ్చింది.
శకుంతలగా కనిపించడానికి డ్రెస్సింగ్ కానీ, ఆభరణాలు కానీ చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. అయితే పువ్వులతో చేసిన ఆభరణాలను ధరించినప్పుడు సమంత చర్మంపై ర్యాషెస్ వచ్చేవట. అయినా కూడా సమంత వాటిని వైద్యం తీసుకుంటూనే.. ఆ ఆభరణాలు ధరించేది అని నీలిమ తెలిపింది. అంతే కాకుండా ఆ ఆభరణాలు చాలా బరువుగా ఉండేవని అయినా కూడా సమంత ఎప్పుడూ అడ్డుచెప్పలేదని చెప్పింది. సమంత వర్క్ చూస్తుంటే చాలా ఇన్‌స్పైరింగ్‌గా ఉంటుందని నీలిమ అంటోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com