Samantha Ruth Prabhu : నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో నీకు తెలిసే ఉంటుంది.. సమంత ఎమోషనల్ పోస్ట్..!

Samantha Ruth Prabhu : ఇపుడు వరుస సినిమాలతో హీరోయిన్ సమంత బిజీగా ఉంది. ఇప్పటికే రెండు సినిమాలను అనౌన్స్ చేసిన సామ్.. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ లో పాల్గొననుంది. దొరికిన ఈ సమయాన్ని స్నేహితులతో కలిసి గడుపుతోంది. తన క్లోజ్ ఫ్రెండ్ శిల్పా రెడ్డితో కలిసి పుణ్యస్థలాలను సదర్శించుకున్న ఆమె.. అక్కడ ప్రత్యేకమైన పూజలు నిర్వహించింది. ఇక తాజాగా తన మరో స్నేహుతురాలు మంజుల పుట్టినరోజు వేడుకకి హాజరైంది.
ఈ వేడుకకి సమంతతో పాటు లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి కూడా హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆసక్తికరమైన పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్ లో సామ్... తన స్నేహితురాలు మంజులను ఉద్దేశిస్తూ.. నీలాంటి స్నేహితురాలు నా జీవితంలోకి రావడం అదృష్ణంగా భావిస్తున్నా. కష్ట సమయంలోనే నిజమైన ఫ్రెండ్ ఎవరో తెలుస్తుందని చెబుతుంటారు. నీ కంటే నిజమైన ఫ్రెండ్ ఎవ్వరూ లేరు డాక్టర్. నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో నీకు తెలిసి ఉంటుందని అనుకుంటున్నాను. హ్యాపీ బర్త్ డే' అంటూ కామెంట్ చేసింది.
కాగా సమంత నటించిన శాంకుతలం చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తోన్నారు.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com