Samantha Ruth Prabhu: నా జీవితంలో ఓ భాగమైనందుకు థాంక్యూ: సమంత

Samantha Ruth Prabhu: ప్రస్తుతం సమంత ఏం చేసినా.. ఏం మాట్లాడినా.. ఆఖరికి సోషల్ మీడియాలో ఏ పోస్ట్ పెట్టిన సెన్సేషనే. సమంత ఏం చేస్తుంది.. తన సినిమాలు ఎక్కడ వరకు వచ్చాయి.. ఏ వెకేషన్స్‌కు వెళ్తోంది.. లాంటి ప్రతీ విషయాన్ని తన సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది సమంత. అలాగే తన ఫాలోవర్స్ కూడా ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా పోస్టులపై ఓ కన్నేసి ఉంటారు. తాజాగా సమంత పెట్టిన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
సమంతకు సినీ పరిశ్రమలోనే కాదు.. బయట కూడా ఫ్రెండ్స్ ఎక్కువే. తన ఫ్రెండ్స్‌తో సరదాగా గడపడం, ట్రిప్స్‌కు వెళ్లడం సామ్‌కు బాగా ఇష్టం. అంతే కాకుండా వారితో దిగిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది సామ్. అంతే కాకుండా తన ఫ్రెండ్స్ పుట్టినరోజు సందర్భంగా సమంత కచ్చితంగా వారికి ఓ కోట్‌తో విషెస్ చెప్తుంది. తాజాగా తన ఫ్రెండ్ క్రేషా బజాజ్‌కు అలాగే బర్త్‌డే విషెస్ తెలిపింది సామ్.
ఇటీవల దర్శకురాలు నందినీ రెడ్డి పుట్టినరోజున కూడా ఓ ఎమోషనల్ నోట్‌తో విషెస్ తెలిపింది సామ్. తనకు ఎవరు లేని సమయంలో నందినీ ఉందంటూ చెప్పుకొచ్చింది సమంత. అలాగే క్రేషాకు కూడా క్యూట్‌గా విషెస్ తెలిపింది. 'హ్యాపీ బర్త్‌డే టు మోస్ట్ బ్యూటిఫుల్ క్రేషా బజాజ్. నా జీవితంలో ఓ భాగమైనందుకు థాంక్యూ. నాకు తెలిసిన చాలా టాలెంటెడ్ ఉన్న వ్యక్తి' అంటూ క్రేషాతో దిగిన ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది సామ్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com