Samantha : ఆపండహే.. మీరు మీ సోది కామెంట్లు.. సమంత ఫైర్

Samantha : ఆపండహే.. మీరు మీ సోది కామెంట్లు.. సమంత ఫైర్
samantha : మహిళలు ధరించే దుస్తులు, మతం, విద్య, సమాజంలోని కీర్తి ప్రతిష్టలు, కనిపించే తీరు, రంగు ఇలా ఎన్నో రకాలు వివక్షను చూపుతుంటారు

Samantha : చైతూతో విడాకుల తర్వాత టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఏం చేసిన అది హాట్ టాపిక్ అవుతుంది.. తాజాగా సోషల్ మీడియాలో సమంత చేసిన క్లీవేజ్‌ షోకు నెటిజన్లు షాక్ అయ్యారు.. ఆమె వస్త్రాధారణ పైన కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు.. దీనితో సమంత హాట్ ఫోటో షూట్ నెట్టింట్లో పెద్ద ఎత్తున దుమారాన్ని రేపింది. దీనిపైన సామ్ కాస్త ఘాటుగానే స్పందించింది.

"మహిళలు ధరించే దుస్తులు, మతం, విద్య, సమాజంలోని కీర్తి ప్రతిష్టలు, కనిపించే తీరు, రంగు ఇలా ఎన్నో రకాలు వివక్షను చూపుతుంటారు. మహిళలను అలా సులభంగా జడ్జ్ చేసేస్తుంటారు. ఇది ఇలా కొనసాగుతూనే ఉంటుంది.. అయినా ఇలా చేయడం తేలికే.. మనం ఇప్పుడు 2022లో ఉన్నాం.. ఇప్పటికైనా మహిళలను అలా జడ్జ్ చేయడం ఆపరా? వారేం ధరించారు, ఎలా కనిపిస్తున్నారనే దానిపై వారిని నిర్ణయిస్తారా" అని ఫైర్ అయింది.


కాగా ఇటీవల ముంబయి వేదికగా జరిగిన క్రిటిక్స్‌ ఛాయిస్‌ అవార్డుల ఫంక్షన్ లో రెడ్‌ కార్పెట్‌పై అందాలు ఆరబోసింది సామ్.. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయ్యాయి. ఇక సామ్ సినిమాల విషయానికి వచ్చేసరికి శాకుంతలం మూవీని ఫినిష్ చేసిన ఆమె.. ప్రస్తుతం యశోద సినిమా షూటింగ్‌తో బిజీగా ఉంది. మరో రెండు ప్రాజెక్ట్ లను లైన్ లో పెట్టింది సామ్.

Tags

Read MoreRead Less
Next Story