Samantha: హాస్పిటల్‌లో చేరిన సమంత.. ఆమె మేనేజర్ ఏం చెబుతున్నారు..

Samantha: మయోసైటిస్ నిర్ధారణ తర్వాత ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారడంతో సమంత రుత్ ప్రభు ఆసుపత్రిలో చేరినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కానీ ఆమె మేనేజర్ ఈ రూమర్లను కొట్టిపారేశారు. ఆమె హైదరాబాద్‌లోని తన నివాసంలోనే ఉందని తెలిపారు.
సమంత ఇటీవల సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టి తనకు వచ్చిన ఆరోగ్య సమస్యను వివరించింది. ప్రస్తుతం తాను కోలుకున్నానని త్వరలో షూటింగ్‌లో పాల్గొంటానని తెలిపింది. యశోద ప్రమోషన్స్‌లో నటి మాట్లాడుతూ, తన పరిస్థితి ప్రాణాపాయం కాదని చెప్పింది.
నిన్న (నవంబర్ 23) నుండి సమంత హైదరాబాద్‌లో ఆసుపత్రిలో చేరినట్లు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అయితే సామ్ ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నట్లు మేనేజర్ చెప్పారు.
వర్క్ ఫ్రంట్‌లో సమంత .. హరి, హరీష్ దర్శకత్వంలో వచ్చిన యశోద చిత్రంలో సమంత లీడ్ రోల్ పోషించి ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొంది. సమంత తదుపరి ప్రాజెక్ట్ గుణశేఖర్ దర్శకత్వంలో వస్తున్న 'శాకుంతలం'. ఈ చిత్రం పౌరాణిక చరిత్ర ఆధారంగా నిర్మితమైంది. ఇంకా విజయదేవరకొండతో 'ఖుషి' చిత్రంలోనూ సమంత నటించింది. ఈ రెండు చిత్రాలు విడుదల కావలసి ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com