Samantha Ruth Prabhu Instagram: మగవారిపై సమంత డైరెక్ట్ అటాక్.. ఆ పోస్ట్‌లో..

Samantha Ruth Prabhu Instagram: సమంత, నాగచైతన్యల విడాకుల వ్యవహారంపై కామెంట్స్ వస్తూనే ఉన్నాయి. అంత క్యూట్ కపుల్ ఎందుకు విడిపోయారు అనే ప్రశ్న ఇంకా అందరినీ డిస్టర్బ్ చేస్తూనే ఉంది. కానీ ఈ సందేహాలకు సమాధానాలు ఇవ్వాలని చైతన్య కానీ, సమంత కానీ అనుకోవట్లేదని స్పష్టమవుతోంది. కానీ సమంత మాత్రం తన సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ ద్వారా అప్పుడప్పుడు తన ఫాలోవర్స్‌తో ఫీలింగ్స్ షేర్ చేసుకుంటూనే ఉంది.
నాగచైతన్య ఎప్పటినుండైనా సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్‌గా ఉండే వ్యక్తి కాదు. అందుకే విడాకుల గురించి ప్రకటించిన తర్వాత తాను సోషల్ మీడియాలో ఎలాంటి పోస్ట్‌లు పెట్టలేదు. కానీ సమంత మాత్రం ఆ తరువాతి రోజు నుండే పరోక్షంగా అభిమానులకు ఏదో ఒకటి చెప్పడానికి ప్రయత్నిస్తూనే ఉంది. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీతో మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.
'ఈ సమాజంలో ఒక మహిళ ఏం చేసినా తనకు ఎదురుప్రశ్నలు తప్పవు. అదే ఒక మగవాడు ఏమైనా చేస్తే అలాంటివి ఏం ఉండవు.' అని అర్థం వచ్చే ఒక పోస్ట్ పెట్టింది. గత కొంతకాలంగా విడాకుల విషయంలో సమంత ఎదుర్కుంటున్న ట్రోలింగ్‌పై తాను ఇస్తున్న సమాధానం ఇదే అనుకుంటున్నారు నెటిజన్లు. ఇది ఆ ట్రోలింగ్స్‌ను ఉద్దేశించిన పోస్టే అని స్పష్టమవుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com