Samantha Ruth Prabhu: 'పుష్ప' టీమ్ నుండి క్రేజీ అప్డేట్.. సీక్వెల్‌లో సమంత..

Samantha Ruth Prabhu: పుష్ప టీమ్ నుండి క్రేజీ అప్డేట్.. సీక్వెల్‌లో సమంత..
Samantha Ruth Prabhu: సమంత వల్ల పుష్పకు క్రేజ్ రావడంతో సీక్వెల్‌లో కూడా సామ్‌కు ఛాన్స్ ఇవ్వాలనుకుంటున్నాడట సుకుమార్.

Samantha Ruth Prabhu: అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన 'పుష్ప' సినిమా ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో కలెక్షన్సే నిరూపించాయి. అల్లు అర్జున్ కెరీర్‌లో ఇది మొదటి పాన్ ఇండియా చిత్రమైనా.. ఈ సినిమాతో అన్ని భాషల ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు బన్నీ. అందుకే ప్రేక్షకులు పుష్ప సీక్వెల్ గురించి ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుండి ఓ క్రేజీ అప్డేట్ ప్రేక్షకులను హ్యాపీ చేస్తోంది.

'పుష్ప' సినిమాలో ప్రతీ అంశాన్ని చాలా జాగ్రత్తగా తెరకెక్కించాడు సుకుమార్. బన్నీ లుక్స్ దగ్గర నుండి సాంగ్స్ వరకు అన్నీ ప్రేక్షకులను మెప్పిచేలా చూసుకున్నాడు. ముఖ్యంగా ఇందులో సమంత ఐటెమ్ సాంగ్ చేయడం అనేది సినిమాకే హైలెట్‌గా నిలిచింది. సమంత ఐటెమ్ సాంగ్ చేస్తుందన్న వార్త బయటికి వచ్చిన దగ్గర నుండి పుష్పపై ప్రేక్షకుల్లో అంచనాలు మరింత పెరిగిపోయాయి.

పుష్పలో సమంత చేసిన 'ఊ అంటావా మామ.. ఊఊ అంటావా' అనే ఐటెమ్ సాంగ్ వల్ల సినిమాకు హైప్ వచ్చిందంటే ఆశ్చర్యం లేదు. అయితే పుష్ప 2 కోసం మాత్రం ఓ బాలీవుడ్ బ్యూటీతో ఐటెమ్ సాంగ్ చేయించాలని ప్లాన్ చేస్తు్న్నాడట సుకుమార్. అందులోనూ దిశా పటానీ పేరు గట్టిగా వినిపిస్తోంది. అయితే సమంత ఫ్యాన్స్ కోసం కూడా పుష్పలో స్పెషల్ గిఫ్ట్ ఉండనుందట.

సమంత వల్ల పుష్పకు క్రేజ్ రావడంతో సీక్వెల్‌లో కూడా సామ్‌కు ఛాన్స్ ఇవ్వాలనుకుంటున్నాడట సుకుమార్. అయితే పుష్ప పార్ట్ 2లో ఐటెమ్ సాంగ్‌లో కానీ, సినిమాలో కానీ సమంత ఏదో ఒకచోట కచ్చితంగా మెరవనుందని సమాచారం. మరి ఒక్కసారి ఐటెమ్ సాంగ్ చేయడానికి ఒప్పుకున్న సమంత.. మరొకసారి ఈ గెస్ట్ రోల్ కోసం ఒప్పుకుంటుందో లేదో చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story