Samantha Ruth Prabhu: బాలీవుడ్ బడా హీరోతో సమంత.. రెమ్యునరేషన్ విషయంలో తగ్గేదేలే..

Samantha Ruth Prabhu: సమంత రుత్ ప్రభు.. ఈ పేరుకు ప్రస్తుతం టాలీవుడ్‌లోనే కాదు మొత్తం సౌత్, నార్త్ ఇండస్ట్రీల్లో కూడా విపరీతమైన పాపులారిటీ ఉంది. సామ్ ఏం చేసినా.. అది ఒక సెన్సేషన్ అయిపోయింది. ఎప్పుడూ సినిమాలతో బిజీగా ఉండే సమంత.. సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఇప్పటికే చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న సామ్‌కు బాలీవుడ్ నుండి ఓ బంపర్ ఆఫర్ వచ్చినట్టు టాక్ వినిపిస్తోంది.
సమంత.. ఇప్పటికే 'ఫ్యామిలీ మ్యాన్ 2' అనే వెబ్ సిరీస్‌తో బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది. ఆ ఒక్క సిరీస్‌తోనే హిందీ ప్రేక్షకులందరినీ ఫిదా చేసేసింది. దీంతో బాలీవుడ్ స్టార్ దర్శక నిర్మాతలు సైతం సామ్‌తో సినిమా చేయాలని ఎదురుచూస్తున్నారు. అయితే సామ్ మాత్రం ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ తెరకెక్కించిన దర్శకులు రాజ్, డీకేలతోనే మరో వెబ్ సిరీస్‌ను ప్లాన్ చేసింది.
ప్రస్తుతం వరుణ్ ధావన్‌తో చేస్తున్న వెబ్ సిరీస్ తప్ప సమంత చేతిలో మరే హిందీ ప్రాజెక్టులు లేవు. తెలుగులో మాత్రం సమంత నటించిన శాకుంతలం విడుదలకు సిద్ధంగా ఉండగా.. యశోద షూటింగ్ దశలో ఉంది. అంతే కాకుండా తన చేతిలో ఓ హాలీవుడ్ ప్రాజెక్ట్ కూడా ఉంది. దీని షూటింగ్ అప్డేట్ ఇంకా తెలియాల్సి ఉంది. ఇంతలోనే సమంతకు మరో బాలీవుడ్ ఆఫర్ వచ్చినట్టు టాక్.
బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ సినిమాలో హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసిందట సమంత. ఓ స్టార్ డైరెక్టర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో సమంతతో పాటు మరో బాలీవుడ్ హీరోయిన్ ఉండనున్నట్టు టాక్. అంతే కాకుండా ఈ సినిమా కోసం సామ్ రూ. 4 నుండి 5 కోట్ల వరకు రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నట్టు టాక్. అంతే కాకుండా సమంత త్వరలోనే మరిన్ని బాలీవుడ్ ప్రాజెక్ట్స్ సైన్ చేసే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com