Samantha Ruth Prabhu: మీరు నా హృదయాన్ని గెలుచుకున్నారు.. ధన్యవాదాలు: అభిమానికి సామ్ రిప్లై

Samantha Ruth Prabhu: మీరు నా హృదయాన్ని గెలుచుకున్నారు.. ధన్యవాదాలు: అభిమానికి సామ్ రిప్లై
Samantha Ruth Prabhu: మన చుట్టూ మన తప్పుల్ని వెదికేవాళ్లు, విమర్శించే వాళ్లే ఉంటారు. అయినా కృంగిపోకుండా వాళ్లని కూడా స్మూత్‌గా హ్యాండిల్ చేస్తూ ముందుకు వెళుతోంది సమంత.

Samantha Ruth Prabhu: మన చుట్టూ మన తప్పుల్ని వెదికేవాళ్లు, విమర్శించే వాళ్లే ఉంటారు. అయినా కృంగిపోకుండా వాళ్లని కూడా స్మూత్‌గా హ్యాండిల్ చేస్తూ ముందుకు వెళుతుంటారు.. ఇది సినిమా నటీ నటులు విషయంలో మరింత ఎక్కువగా ఉంటుంది. స్టార్ హీరోయిన్ సమంత మయోసైటిస్‌తో బాధపడుతున్నాను అన్నప్పుడు అయ్యో అన్నవాళ్లే.. శాకుంతలం టీజర్ విడుదల సందర్భంగా ఎమోషనల్ అయినప్పుడు సానుభూతి ఎందుకు కోరుకుంటున్నావు అని అన్నారు.. అయినా అవేమీ పట్టించుకోలేదు సామ్.. ఇవి కూడా పట్టించుకుంటే ముందుకు వెళ్లడం కష్టం అనుకుంది వారి ఖర్మానికే వారిని వదిలేసింది. కానీ కొందరు మాత్రం స్పూర్తినిచ్చే పదాలు వాడతారు.. మనుషలను నొప్పించని మనస్తత్వం వారికి ఉంటుంది. వాళ్లు అభిమానులే కానవసరం లేదు. సాటి మనిషి కష్టంలో ఉన్నప్పుడు నాలుగు మంచి మాటలు మాట్లాడే మనసుంటే చాలు.. ప్రతి రోజూ ఆమెకు ప్రేరణ, ప్రోత్సాహం అందించే ట్వీట్లు చేస్తుంటారు. అవి సామ్ మనసుకు స్వాంతన చేకూరుస్తుంటాయి.


సమంత తన వ్యక్తిగత శిక్షకుడు జునైద్ షేక్‌తో కలిసి వర్కవుట్ చేస్తున్న సెల్ఫీని ట్వీట్ చేసి అందరి నుండి ప్రశంసలు అందుకుంది. సమంతా జిమ్ నుండి ఒక చిత్రాన్ని Instagram స్టోరీస్‌లో పంచుకుంటూ " ఇది అంత సున్నితమైనది కాదు #ificanyoucan (sic)" అని రాసింది.



ఓ అభిమాని నుండి వచ్చిన సుదీర్ఘ సందేశంపై కూడా సామ్ స్పందించింది. "వావ్.. మీ సందేశం నా మనసును తాకింది. ధన్యవాదాలు, నా మనసును దోచుకున్నారు, "ఆమె మంగళవారం ఒక పోస్ట్‌లో రాసింది.



సమంత తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఫైర్ ఎమోజితో కోట్‌ను పంచుకోవడంతో హాలీవుడ్ నటి కూలిడ్జ్ నుండి ఆమె ప్రేరణ పొందినట్లు పేర్కొంది. వర్క్ ఫ్రంట్‌లో, సామ్ 'శాకుంతలం', 'ఖుషి' మరియు 'సిటాడెల్'లో కనిపించనుంది. 'శాకుంతలం' నుండి మొదటి సింగిల్ జనవరి 18న విడుదలవుతుందని చిత్ర యూనిట్ తెలిపింది. 'ఈ చిత్రానికి మణి శర్మ సంగీతం అందించారు.


Tags

Read MoreRead Less
Next Story