Samantha Ruth Prabhu: మయోసైటిస్ బాధ మరింకెన్నాళ్లు.. సమంత కొత్త ప్రాజెక్ట్!!

Samantha Ruth Prabhu: మయోసైటిస్ బాధ మరింకెన్నాళ్లు.. సమంత కొత్త ప్రాజెక్ట్!!
Samantha Ruth Prabhu: సినిమా తారలు హెల్త్ ఈజ్ వెల్త్ అనే మాటను అక్షరాలా పాటిస్తారు. నోరు కట్టుకుని డైటింగ్ పేరుతో ఫిజిక్ నూ కాపాడుకుంటారు.

Samantha Ruth Prabhu: సినిమా తారలు హెల్త్ ఈజ్ వెల్త్ అనే మాటను అక్షరాలా పాటిస్తారు. నోరు కట్టుకుని డైటింగ్ పేరుతో ఫిజిక్ నూ కాపాడుకుంటారు. కానీ అనుకోని అనారోగ్య సమస్యలు వస్తే ఇవన్నీ పక్కకు వెళ్లిపోతాయి. ఇలాంటప్పుడు డైటింగ్ మాత్రమే కాదు.. ఆఫర్స్ కూడా పోతాయి. కొన్నాళ్ల క్రితం మయోసైటిస్ అనే వ్యాధి బారిన పడిన సమంతకు కూడా ఇదే జరిగింది. ఇన్నాళ్లూ తను చాలా హోప్స్ పెట్టుకున్న ఓ క్రేజీ ప్రాజెక్ట్ తన చేజారిపోయింది.


అన్నీ ఉన్నప్పుడు బానే ఉంటుంది. ఏదైనా అనారోగ్య సమస్య వస్తేనే లైఫ్ అంటే ఏంటో తెలుస్తుంది. సంపన్నులైనా.. సాధారణ ప్రజలైనా.. బాగు చేయించుకునేంత వరకూ ఇబ్బంది పడక తప్పదు. ప్రస్తుతం ఆ ఇబ్బందుల్లోనే ఉంది సమంత. మయోసైటిస్ అనే వ్యాధి కారణంగా ఇప్పటికే ఆరు నెలలకు పైగా షూటింగ్స్ కు ఫుల్ స్టా పెట్టింది. చికిత్స తీసుకుంటూ ఇంట్లోనే ఉండిపోయింది. ఈ వ్యాధి వల్ల ముఖ్యంగా తన ఫేస్ లో చాలా మార్పులు వచ్చాయట.



అందుకే షూటింగ్ కు దూరంగా ఉంటోంది. ఈ కారణంగానే ఇప్పటికే 70శాతానికి పైగా చిత్రీకరణ జరుపుకున్న ఖుషీ సినిమా కూడా ఆగిపోయింది. అయితే ఈ మూవీ టైమ్ లోనే తను ఓ హాలీవుడ్ మూవీతో పాటు హిందీలో ఓ వెబ్ సిరీస్ కు కూడా ఓకే చెప్పింది. ప్రస్తుతానికి హాలీవుడ్ ప్రాజెక్ట్ కు సంబంధించి ఏ అప్డేట్ లేదు కానీ.. వెబ్ సిరీస్ మాత్రం తన చేతి నుంచి పోయింది. ఇది ఓ హాలీవుడ్ సిరీస్. అక్కడ ప్రియాంక చోప్రా, రిచర్డ్ మాడెన్ నటిస్తున్నారు.



ఇండియన్ వెర్షన్ లో సమంతతో పాటు వరుణ ధావణ్ ను సెలెక్ట్ చేసుకున్నారు. ఈ సిరీస్ ను ఇక్కడ ఫ్యామిలీ మేన్ ఫేమ్ రాజ్ - డికే దర్శక ద్వయం రూపొందించాల్సి ఉంది. ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ కావాల్సిన సిరీస్ సమంత హెల్త్ ఇష్యూ వల్ల ఆగిపోయింది. అయితే ఈ దర్శకులతో తను గతంలో ఫ్యామిలీ మేన్ 2లో నటించింది. ఆ స్నేహం కొద్దీ తన కోసం వాళ్లు వెయిట్ చేస్తున్నారు. బట్ సమంత మాత్రం ఇప్పట్లో తను డేట్స్ ఇవ్వలేనని.. ఇచ్చినా డెడికేటెడ్ గా వర్క్ చేయలేనని చెప్పి ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందీ అంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story