Samantha: AskSam సెషన్.. బెస్ట్ ఫ్రెండ్ గురించి ఓపెన్ అయిన సమంత

Samantha: AskSam సెషన్.. బెస్ట్ ఫ్రెండ్ గురించి ఓపెన్ అయిన సమంత
Samantha: తన తిరుగులేని అందం, అద్బుతమైన నటన, ఆకట్టుకునే హావభావాలతో తెలుగు సినిమా ప్రేక్షకులను దశాబ్ద కాలంగా అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతోంది సమంత.

Samantha: తన తిరుగులేని అందం, అద్బుతమైన నటన, ఆకట్టుకునే హావభావాలతో తెలుగు సినిమా ప్రేక్షకులను దశాబ్ద కాలంగా అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతోంది సమంత. అద్భుతమైన పాత్రలతో ఆకట్టుకుంటున్న సామ్.. దేశం మొత్తం తన వైపు చూసేలా చేస్తోంది. ఈ క్రమంలో సమంత ‘శాకుంతలం’ అనే సినిమాతో రాబోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె సోషల్ మీడియాలో లైవ్ చాట్ చేసింది. ఇందులో ఓ నెటిజన్ సామ్‌కు వార్నింగ్ ఇచ్చాడు. 'ఏమాయ చేశావే' సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సమంత ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి స్టార్‌గా ఎదిగింది. దశాబ్ద కాలంగా సిల్వర్ స్క్రీన్‌పై తన ప్రతిభను కనబరుస్తోంది. అయితే ఈ మధ్య కాలంలో సమంత తన స్టైల్ మార్చుకుని తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలు, వెబ్ సిరీస్‌లో నటిస్తోంది.

గతేడాది ‘యశోద’గా హిట్ కొట్టిన సమంత.. ఇప్పుడు గుణశేఖర్ దర్శకత్వంలో ‘శాకుంతలం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. గుణ టీమ్ వర్క్స్ బ్యానర్‌పై నీలిమ ఈ చిత్రాన్ని నిర్మించారు. దిల్ రాజు ఈ చిత్రానికి నిర్మాణ భాగస్వామి. దీనికి మణిశర్మ సంగీతం అందించారు. ఈ చిత్రంలో సమంతకు జోడీగా మలయాళీ నటుడు దేవ్ మోహన్ దుష్యంతునిగా నటించి సమంతకు సరిజోడీ అనిపించారు. 'శాకుంతలం' చిత్రం ఐదు భాషల్లో రూపొందింది. ఏప్రిల్ 14న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతోంది.. గత కొన్ని రోజులుగా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో సమంత బిజీగా ఉంది. సోషల్ మీడియాలో తన ట్విట్టర్ ఖాతా ద్వారా ‘శాకుంతలం’ సినిమా విడుదల సందర్భంగా అభిమానులతో ముచ్చటించింది. ఇందులో వారు ఆమెను అనేక రకాల ప్రశ్నలు అడిగారు. అందులో వ్యక్తిగత విషయాలను కూడా ప్రస్తావించారు. వారందరికీ సమంత చాలా హుందాగా సమాధానమిచ్చింది.

సమంతా రూత్ ప్రభు ట్విట్టర్‌లో ఇటీవల నిర్వహించిన AskSam సెషన్‌లో, ఒక నెటిజన్, 'నువ్వు టీనేజ్ అమ్మాయిలా కనిపిస్తున్నావు, నీ లుక్స్ చాలా బాగున్నాయి. ఇంకొంత సేపు ఇలా క్యూట్‌గా కనిపించడానికి ప్రయత్నిస్తావా' అని అడిగాడు. దీనికి సమంత 'గ్లాసెస్ నా కొత్త బెస్ట్ ఫ్రెండ్' అని చెప్పింది. అదే సెషన్‌లో మరో నెటిజన్ సమంతను ఉద్దేశించి, 'ఓ బేబీ సినిమా సమయంలో మీరు నాకు రిప్లై ఇచ్చారు. ఆ తర్వాత సినిమా సూపర్ హిట్ అయింది. ఇప్పుడు సమాధానం చెప్పు.. శకుంతలం బ్లాక్ బస్టర్ అవుతుంది' అంటూ పరోక్షంగా బెదిరించాడు. దీనికి సమంత 'వామ్మో.. అయితే నీతో జాగ్రత్తగా ఉండాలి' అంటూ ఫన్నీగా రిప్లై ఇచ్చింది.

Tags

Read MoreRead Less
Next Story