Samantha Ruth Prabhu: మాట్లాడే ముందు ఆలోచించడం నాకు నచ్చదు: సమంత

Samantha Ruth Prabhu: ప్రస్తుతం హీరోయిన్ సమంత ఏం చెప్పినా, ఏం చేసినా సెన్సేషనే. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న హీరోయిన్స్‌లో సమంత పేరు ముందుంటుంది. తాను ఏ పోస్ట్ పెట్టినా.. దానికి కొన్ని గంటల్లోనే లక్షల కొద్దీ లైకులు వచ్చి పడుతున్నాయి. ఎప్పుడూ ఏదో ఒక కోట్‌ను తన స్టోరీగా పెట్టుకునే సమంత.. కొన్నిరోజులుగా గ్యాప్ ఇచ్చింది. తాజాగా తన మనస్తత్వం గురించి అందరికీ తెలిసేలా ఓ పోస్ట్‌ను తన స్టోరీలో షేర్ చేసింది సామ్.
సమంత ప్రస్తుతం 'యశోద' సినిమా షూటింగ్‌లో బిజీగా ఉంది. 'శాకుంతలం' తర్వాత సమంత చేస్తున్న మరో పాన్ ఇండియా చిత్రమిది. తాజాగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమయ్యింది. యశోదలో మరో కీలక పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ కనిపించనుంది. తాజాగా వీరిద్దరి ఫన్నీ మూమెంట్స్ కొన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది సమంత.
ఒక్కొక్కసారి కొన్ని కోట్స్ చూసినప్పుడు అవి మనకు చాలా కనెక్ట్ అవుతున్నాయి అనిపిస్తుంటుంది. అలా తనకు కనెక్ట్ అయిన ఒక కోట్‌ను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది సమంత. 'నేను మాట్లాడే ముందు ఆలోచించడం నాకు ఇష్టం ఉండదు. మిగతా వారిలాగానే నా నోటి నుండి వచ్చే మాటలకు నేను కూడా సర్‌ప్రైజ్ అవ్వడం నాకు ఇష్టం' అని ఉన్న కోట్ తనకు రిలేట్ అవుతుందంటూ స్టోరీ పెట్టింది సామ్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com