Samantha Ruth Prabhu: యువ దర్శకుడి కథకి ఓకే చెప్పిన సమంత.. త్వరలో సెట్స్ పైకి

Samantha Ruth Prabhu: ఇప్పటికే సమంత నటించిన రెండు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.. మరో సినిమా విజయ దేవరకొండతో చేస్తోంది.. ఇది షూట్ జరుగుతుండగానే మరో పాన్ ఇండియా మూవీలో నటించేందుకు సైన్ చేసింది సమంత. యువ దర్శకుడు తన స్క్రిప్ట్‌తో ఆమెను ఆకట్టుకున్నాడు. దాంతో వెంటనే ఆమె ఓకే చేసింది.
ఈ కొత్త ప్రాజెక్ట్ కు సంబంధించిన డైరెక్టర్, నటీనటులుతదితర వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. ప్రాజెక్ట్ అధికారికంగా ప్రకటించబడిన తర్వాత మరిన్ని వివరాలు బయటకు వస్తాయి.
సినిమాల్లో నటిగా బిజీగా ఉంటూనే సమంత అమెజాన్ ప్రైమ్ వీడియోతో వెబ్ సిరీస్‌కు కూడా సంతకం చేసింది. ఇప్పటికే ఆమె చేసిన వెబ్ సిరీస్ ప్రియమణి, మనోజ్ బాజ్‌పేయి తో కలిసి నటించిన ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 ఆమె నటన ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది.
దశాబ్ధకాలంగా ఇండస్ట్రీలో ఉన్నా తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఫిట్ నెస్ ఎప్పుడూ ధ్యాస ఉంచుతుంది.. వర్కవుట్స్ కి సంబంధించిన వీడియోలు పోస్ట్ చేస్తుంటుంది అభిమానుల కోసం.
ప్రతి రోజు వ్యాయామం, తీసుకునే ఆహారం ఆమెను ఫిట్ గా ఉంచుతుంటాయి. దాంతో పాటు పాజిటివ్ థింకింగ్, వర్క్ మీదే ఫోకస్ ఆమెని స్టార్ హీరోయిన్ ని చేశాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com