Samantha: మా మధ్య సఖ్యత లేదు.. ఒకే గదిలో ఉంచితే ఆయుధాలు లేకుండా చూడాలి: సమంత షాకింగ్ కామెంట్స్

Samantha: మా మధ్య సఖ్యత లేదు.. ఒకే గదిలో ఉంచితే ఆయుధాలు లేకుండా చూడాలి: సమంత షాకింగ్ కామెంట్స్
Samantha: ఇద్దరూ ఈడు జోడు ఎంత బావుంటారు.. ప్చ్ ఎందుకు విడిపోయారో.. ఏమై ఉంటుందో.. అభిమానులను తొలిచేస్తున్న ప్రశ్నలకు ఇంతవరకు ఆన్సర్ దొరకలేదు

Samantha: ఇద్దరూ ఈడు జోడు ఎంత బావుంటారు.. ప్చ్ ఎందుకు విడిపోయారో.. ఏమై ఉంటుందో.. అభిమానులను తొలిచేస్తున్న ప్రశ్నలకు ఇంతవరకు ఆన్సర్ దొరకలేదు సమంత, నాగచైతన్య డైవోర్స్ విషయంలో. అయితే బాలీవుడ్ నిర్మాత, దర్శకుడు కరణ్ జోహార్ నిర్వహిస్తున్న టాక్ షో కాఫీ విత్ కరణ్‌లో సమంత వస్తుందని తెలిసి ఆ ఎపిసోడ్ కోసం వెయిట్ చేశారు ప్రేక్షకులు..

గురువారం ప్రసారమైన ఈ షోలో సమంత తన వివాహబంధం బీటలు వారడానికి గల కారణాలు చెప్పీ చెప్పకుండా చెప్పింది. తామిద్దరం విడిపోవడం అంత సులభంగా జరగలేదని చెప్పింది. తమ మధ్య సఖ్యత లేదని ఒకవేళ ఇద్దర్నీ ఒకే గదిలో ఉంచితే అక్కడ పదునైన ఆయుధాలు లేకుండా చూడాలి అని ఆమె చెప్పుకొచ్చారు.

నీ భర్త నుంచి విడిపోయినప్పుడు నువ్వు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నావు అని కరణ్ అడగ్గానే.. సమంత సీరియస్‌గా భర్త కాదు మాజీ భర్త అనండి అని చెప్పింది. దాంతో కరణ్ సమంతకు సారీ చెబుతూ మాజీ భర్త అనే పదాన్ని వాడుతూ ప్రశ్నలు అడిగారు.

విడిపోయినప్పుడు చాలా మనోవేదనకు గురయ్యా.. ప్రస్తుతం ఆ బాధ నుంచి బయటపడ్డా.. ఇంతకు ముందులా కాకుండా ఇప్పుడు స్ట్రాంగ్‌గా ఉన్నాను అని చెప్పింది. భవిష్యత్తులో మా మధ్య సఖ్యత వస్తుందేమో తెలియదు.. మేమిద్దరం విడిపోయినప్పుడు తప్పంతా నాదే అన్నట్లు నామీద నెగటివ్ ప్రచారం జరిగింది. ఆ సమయంలో వాటిపై స్పందించేందుకు నా దగ్గర సమాధానాలు కూడా లేవు.

నేను ఓపెన్‌గా ఉండాలనుకున్నా.. అందుకే విడిపోయిన విషయాన్ని అందిరితో చెప్పా. ఆ తరువాత కొన్ని రోజులకే ఊ అంటావా సాంగ్ ఆఫర్ వచ్చింది. ఆ పాట లిరిక్స్ నచ్చాయి. పురుషాధిక్య సమాజంలో వారిలోని లోపాలు ఎత్తి చూపడానికి ఈ పాట సరైందని భావించి అందులో యాక్ట్ చేయడానికి ఒప్పుకున్నానని తెలిపింది.

అనంతరం తాను భరణం కింద రూ.250 కోట్లు తీసుకున్నానని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది.. వాటిని చూసి మొదట షాక్ అయ్యాను.. ఎవరైనా ఇన్‌కం ట్యాక్స్ అధికారి మా ఇంటికి వచ్చి దాడులు చేసి అవన్నీ అబద్దాలు అని చెబితే బావుండు అని రోజూ ఎదురు చూసేదాన్ని అని సమంత పేర్కొంది. భవిష్యత్తులో మీ జీవితంలోకి మరొకర్ని ఆహ్వానించే అవకాశం ఉందా అని అంటే అలాంటివేమీ జరగవని చెప్పుకొచ్చింది.

Tags

Read MoreRead Less
Next Story