Samantha Ruth Prabhu : రెమ్యునరేషన్ పెంచేసిన సామ్... ఒక్కో సినిమాకి ఏకంగా?

Samantha Ruth Prabhu : రెమ్యునరేషన్ పెంచేసిన సామ్... ఒక్కో సినిమాకి ఏకంగా?
Samantha Ruth Prabhu : సమంత తాజాగా కమిట్ అయిన సినిమాలకి రెమ్యునరేషన్ పెంచిందా అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు..

Samantha Ruth Prabhu : సమంత తాజాగా కమిట్ అయిన సినిమాలకి రెమ్యునరేషన్ పెంచిందా అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు.. తెలుగులో 'శాకుంతలం', తమిళంలో మల్టీస్టారర్ మూవీ 'కాతు వాకుల రెండు కాదల్' లను కంప్లీట్ చేసిన సామ్.. చేయబోయే సినిమాలకి సంబంధించి కథలు వింటుంది. ఈ క్రమంలోనే దసరా సందర్భంగా రెండు కొత్త ప్రాజెక్ట్స్‌ లకి సంబంధించిన అప్డేట్స్ ఇచ్చింది. ఇందులో ఓ సినిమాని శ్రీదేవి మూవీస్ బ్యానర్‌లో మరో సినిమాని డ్రీమ్ వారియర్ పిక్చర్‌లో చేస్తోంది. ఇదిలావుండగా తాజాగా 'దసరా' అనే కొత్త సినిమాని అనౌన్సు చేశాడు హీరో నాని.. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్ లకి స్కోప్ ఉందట.. ఇప్పటికే ఓ హీరోయిన్‌‌గా కీర్తి సురేష్ ఫైనల్ అవ్వగా, మరో హీరోయిన్‌‌గా సమంతను అనుకుంటున్నారట మేకర్స్... అయితే ఈ మూవీలో నటించేందుకు ఆమె 3 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నట్టుగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనిపైన అధికార ప్రకటన రావాల్సి ఉంది.

Tags

Read MoreRead Less
Next Story