Samantha Ruth Prabhu : సమంత హాలీవుడ్ సినిమా.. బై-సెక్సువల్ అమ్మాయిగా..!

Samantha Ruth Prabhu : ఇప్పుడు వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్ సమంత ఫుల్ బిజీగా ఉంది. తెలుగు, తమిళ్ లో రెండు సినిమాలు ఫినిష్ చేసింది. ఇవి రిలీజ్ కి సిద్దంగా ఉన్నాయి. ఇవే కాకుండా మరో రెండు సినిమాలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. పుష్ప సినిమాలో బన్నీ సరసన ఐటెంసాంగ్ కూడా చేస్తోంది.
ఇప్పుడు ఏకంగా ఓ హాలీవుడ్ ప్రాజెక్ట్ కి ఒకే చెప్పింది. ఫిలిప్ జాన్ దర్శకత్వంలో ఓ ఇంటర్నేషనల్ సినిమా చేయబోతోంది సామ్.. ఇందులో సామ్ ... బై-సెక్సువల్ తమిళ అమ్మాయిగా కనిపించబోతోంది. అంటే కేవలం పురుషులకు మాత్రమే కాకుండా, స్త్రీల ఆకర్షణకు కూడా లోనయ్యే యువతి పాత్ర అన్నమాట.
ఈ సినిమా పేరు ఎరేంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్. భారతీయ రచయిత ఎన్.మురారి రాసిన పుస్తకానికి నవలా రూపం ఈ చిత్రం. 2004లో అత్యధికంగా అమ్ముడైన నవల ఇది. తమిళ, హిందీ భాషలతో పాటు ఇంగ్లిష్, ఫ్రెంచ్ లాంటి భాషల్లో ఈ సినిమా తెరకెక్కతోంది.
ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. ఈ చిత్రాన్ని ఇండియన్ అవుట్‌ఫిట్ గురు ఫిల్మ్స్ నిర్మిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఆగస్ట్, 2022లో ప్రారంభం కానుంది
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com