Samantha Ruth Prabhu: 'యశోద' మూవీ నుండి క్రేజీ అప్డేట్.. గ్లింప్స్ రిలీజ్‌కు డేట్ ఫిక్స్..

Samantha Ruth Prabhu: సౌత్ సెన్సేషన్ సమంత ప్రస్తుతం హీరోయిన్లలో టాప్ 1 పొజిషన్‌లో ఉంది అని చెప్పడానికి ఎలాంటి ఆశ్చర్యం లేదు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు, యాడ్స్, వెబ్ సిరీస్‌లతో సమంత కెరీర్ చాలా బిజీగా సాగిపోతోంది. ఇక ఏప్రిల్ 28న సమంత పుట్టినరోజు సందర్భంగా తన అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్‌కు సంబంధించిన వారంతా సామ్‌కు విషెస్ తెలియజేశారు. ఇక సమంత నటిస్తున్న 'యశోద' మూవీ టీమ్ మాత్రం తన ఫ్యాన్స్‌ను ఖుషీ చేసే న్యూస్ తెలిపింది.
ప్రస్తుతం సమంత ఎక్కువగా కంటెంట్ ఉన్న సినిమాలనే ఎంచుకుంటూ వెళ్తోంది. అంతే కాకుండా తన పాపులారిటీని దృష్టిలో పెట్టుకొని మేకర్స్ కూడా తనను లీడ్ రోల్‌గా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు ప్లాన్ చేస్తున్నారు. అంతే కాకుండా వాటిని పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కిస్తున్నారు. అలాంటి ఒక చిత్రమే 'యశోద'. ఇటీవల ఈ మూవీ నుండి ఓ క్రేజీ అప్డేట్ బయటికొచ్చింది.
సమంత.. తన ఇతర సినిమాలతో పాటు 'యశోద' మూవీ షూటింగ్‌లో కూడా రెగ్యులర్‌గా పాల్గొంటోంది. ఇప్పటకే ఈ సినిమా పలు షెడ్యూల్స్‌ను పూర్తి చేసుకుంది. ఆగస్ట్ 12న ఈ సినిమా రిలీజ్ కూడా ఖరారు అయ్యింది. అయితే యశోద మూవీ గ్లింప్స్‌ను మే 5న ఉదయం 11.07 గంటలకు విడుదల చేస్తున్నట్టు టీమ్ ప్రకటించింది. దీంతో సమంత ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు.
Wishing our dearest @Samanthaprabhu2 a very Happy Birthday 💐
— Sridevi Movies (@SrideviMovieOff) April 28, 2022
The thrilling first glimpse of our #Yashoda will be out on May 5th, 11:07AM 🔥💥#HappyBirthdaySamantha #YashodaTheMovie @Iamunnimukundan @varusarath5 @dirharishankar @hareeshnarayan @mynnasukumar @krishnasivalenk pic.twitter.com/xRSIQhpZQr
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com