Samantha Ruth Prabhu: అక్కినేని హీరోలతో పోటీకి దిగుతున్న సమంత..
Samantha Ruth Prabhu: స్టార్ హీరోలకు సైతం గట్టి పోటీ ఇస్తూ.. సమంత రుత్ ప్రభు పాన్ ఇండియా సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటూ.. సూపర్ హిట్‌లను ఖాతాలో వేసుకుంటోంది. ప్రస్తుతం సమంత చేతిలో ఉన్న రెండు సినిమాలు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలే. అందులో ఒకటి 'యశోద'. ఈ మూవీ రిలీజ్ డేట్‌పై ప్రస్తుతం టాలీవుడ్‌లో పెద్ద చర్చే నడుస్తోంది.
సమంత క్రేజ్ ఇప్పుడు మామూలుగా లేదు. ఒకవైపు సినిమాలతో, మరోవైపు బ్రాండ్ యాడ్‌లతో బిజీగా గడిపేస్తోంది. సౌత్‌లోనే కాకుండా బాలీవుడ్, హాలీవుడ్‌లో కూడా సమంత అవకాశాలు దక్కించుకుంటోంది. ప్రస్తుతం సామ్.. బాలీవుడ్‌లో ఓ వెబ్ సిరీస్‌తో పాటు తెలుగులో యశోద షూటింగ్‌తో బిజీగా ఉంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న యశోద మూవీ నుండి తాజాగా ఓ అప్డేట్ బయటికి వచ్చింది.
యశోద సినిమా విడుదల తేదీ ఆగస్ట్ 12న ఖరారు చేసింది. అయితే ఇదే తేదీలో అక్కినేని హీరోల సినిమాలు కూడా విడుదలకు సిద్ధంగా ఉండడం హాట్ టాపిక్‌గా మారింది. అక్కినేని పెద్దోడు నాగచైతన్య తన బాలీవుడ్ డెబ్యూ మూవీ 'లాల్ సింగ్ చడ్డా' కూడా ఆగస్ట్ 12నే విడుదల కానుంది. అంతే కాకుండా అఖిల్ 'ఏజెంట్'ను ఇదే తేదీకి విడుదల చేయాలని మూవీ టీమ్ ప్లాన్ చేస్తోంది. మరీ ఈ ఫైట్‌లో ఎవరి మూవీకి ఎక్కువ కలెక్షన్స్ వస్తాయా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com