Samantha Ruth Prabhu: అన్ని కండీషన్స్ మధ్య శాకుంతలం సినిమా చేసిన సమంత

Samantha Ruth Prabhu: అక్కినేని నాగచైతన్య, సమంత.. ఇరువురు అనుకునే, పరస్పర అంగీకారంతోనే విడాకులు తీసుకున్నారు. కానీ చైతూ కంటే ఎక్కువ నెగిటివిటీని సమంతనే ఫేస్ చేస్తోంది. అందుకే విడాకుల ప్రకటన తర్వాత తన భావాలన్నీ పరోక్షంగా తన ఇన్‌స్టాగ్రామ్ ఫోలోవర్స్‌తో పంచుకుంటోంది సామ్. తాజాగా మరో పోస్ట్‌లో తనపై జరుగుతున్న ట్రోలింగ్స్ గురించి నేరుగా కూడా స్పందించింది.
'నన్ను కొందరు వ్యక్తిగతంగా టార్గెట్ చేసి, నాకు అఫైర్స్ ఉన్నాయని, అబార్షన్స్ చేయించుకున్నానని, నేను అవకాశవాదినని అంటున్నారు. విడాకులు తీసుకోవడం అనేది ఎంతో బాధతో కూడుకున్నది. నన్ను ఒంటరిగా వదిలేయండి' అని సామ్ తన ఇన్స్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా విజ్ఞప్తి చేసింది. ఈ స్టోరీ పెట్టిన తర్వాత దర్శకుడు గుణశేఖర్ కూతురు, సామ్ నటిస్తున్న శాకుంతలం సినిమా నిర్మాత నీలిమ గుణ దీనిపై స్పందించి పలు ఆసక్తికర విషయాలను బయటపెట్టారు.
శాకుంతలం సినిమా కోసం సమంతను దర్శకుడు గుణశేఖర్ సంప్రదించాడు. అప్పటికే సినిమాల నుండి కొంతకాలం బ్రేక్ తీసుకొని ఫ్యామిలీని మొదలుపెట్టాలనుకుంది సామ్. కానీ శాకుంతలం కథ తనకు బాగా నచ్చడంతో కొన్ని కండిషన్స్‌తో తను సినిమా చేయడానికి ఒప్పుకుంది. జూలై, ఆగస్ట్‌లోపు షూటింగ్ పూర్తిచేయాలన్నది సామ్ కండిషన్. ఆ తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చి పిల్లలను కనాలని ప్లాన్ చేసుకుంది. తన ప్రాధాన్యత కూడా అదే అని చెప్పింది.
సమంత చెప్పినట్టుగానే షెడ్యూల్స్‌ను ప్లాన్ చేసుకుంది శాకుంతలం టీమ్. అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తి చేసింది. ఆ తర్వాత సామ్ ఫ్యామిలీ లైఫ్‌లో ఏదో జరిగిందని, వారు ఇలా అనుకోకుండా విడాకులను ప్రకటించడం చాలా షాకింగ్‌గా ఉందని నీలిమ గుణ తెలిపారు. సమంత తల్లి కావాలనుకుంది అన్న విషయంపై వచ్చిన కథనాన్ని తన పర్సనల్ డిజైనర్ ప్రీతమ్ జుకల్కర్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పెట్టాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com