సినిమా

Samantha Ruth Prabhu : దసరా రోజున అభిమానులకి సమంత బిగ్ సర్‌ప్రైజ్..!

Samantha Ruth Prabhu : అక్కినేని నాగ చైతన్యతో విడాకుల తర్వాత సోషల్ మీడియాలో సమంత కాస్త సైలెంట్ అయింది అని చెప్పాలి..

Samantha Ruth Prabhu : దసరా రోజున అభిమానులకి సమంత బిగ్ సర్‌ప్రైజ్..!
X

Samantha Ruth Prabhu : అక్కినేని నాగ చైతన్యతో విడాకుల తర్వాత సోషల్ మీడియాలో సమంత కాస్త సైలెంట్ అయింది అని చెప్పాలి.. ఇప్పుడు కెరీర్ పైనే పూర్తిగా దృష్టి పెట్టిన ఆమె.. దసరా సందర్భంగా అభిమానులకి బిగ్ సప్రైజ్ ఇవ్వనుందని తెలుస్తోంది.

అక్టోబర్ 15న దసరా సందర్భంగా సమంత కొత్త ప్రాజెక్టుల గురించి ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. శివలెంక కృష్ణప్రసాద్ నిర్మాతగా ఓ కొత్త దర్శకుడు చెప్పిన కథకి సమంత ఓకే చెప్పినట్లు సమాచారం.

దీనికి సంబంధించిన అఫిషియల్ అనౌన్స్మెంట్ రేపు రానుందని ఫిలింనగర్లో టాక్. అలాగే 'ది ఫ్యామిలీ మ్యాన్ 2' దర్శకుడు రాజ్ డీకేతో ఆమె మరోసారి పనిచేయబోతున్నట్టు తెలుస్తోంది. దీనిపై రేపు స్పష్టత వచ్చే అవకాశం ఉందని సమాచారం.

ఇవి రెండూ కాకుండా బాలీవుడ్లో మరో లేడీ ఓరియెంటెడ్ సినిమాకి సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా టాక్ వినిపిస్తోంది. కాగా గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం సినిమాను ఇప్పటికే కంప్లీట్ చేసిన సమంత... తమిళంలో చేస్తున్న 'కాతు వాకుల రెండు కాదల్' సినిమా ఫినిషింగ్ స్టేజ్ లో ఉంది.Next Story

RELATED STORIES