Samantha: సమంత సంచలన నిర్ణయం.. ఇకపై..

Samantha: ఊహించనవి జరగడమే జీవితం.. లైఫ్‌లో ఎదురయ్యే సమస్యలను తట్టుకుని నిలబడాలి.. ఎన్నో సవాళ్లు, మరెన్నో అడ్డంగులు.. అయినా అన్నింటినీ అధిగమించి.. నువ్వేంటో నిరూపించుకోవాలి. కష్టం వచ్చిందని కృంగిపోతే మిగతా లైఫ్ లీడ్ చేయడం మరింత కష్టం. ప్రస్తుతం సమంత గత జీవితం తాలూకు గుర్తులను మనసులో నుంచి చెరిపేసుకోవడానికి ప్రయత్నిస్తోంది.
సమయాన్ని సంతోషంగా గడపడాలని చూస్తోంది. కెరీర్‌లో బిజీగా ఉండడానికి ప్రయత్నిస్తోంది. తీర్ధస్థలాలు సందర్శిస్తూ మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడానికి ట్రై చేస్తోంది. తన మనసులోని భావాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో 'మై మామ్ సెడ్' పేరుతో షేర్ చేస్తోంది. అయితే సామ్ ఇక నుంచి వాటన్నింటికీ చెక్ పెట్టాలనుకుంటోందని సమాచారం.
తను చేసే పోస్ట్‌ల ద్వారా సామ్ మనసు ఎంత అలజడిగా ఉందో అర్ధమవుతోంది. అయితే ఇకపై సోషల్ మీడియాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుందట. అలాగే తన సామాజిక మాధ్యమాల అకౌంట్లను కూడా డిలీట్ చేయాలనుకున్నట్లు తెలుస్తోంది. కానీ సామ్ అభిమానులు ఆమె తీసుకున్న నిర్ణయం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తన వ్యక్తిగత నిర్ణయాన్ని తప్పుపడుతూ కొంతమంది వ్యక్తులు పనిగట్టుకుని చేస్తున్న ఆరోపణలకు కంప్లైంట్‌తో బ్రేక్ పడినా, సమంత కూడా తన స్వవిషయాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయకూడదని జారీ చేసిన ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సన్నిహిత వర్గాల సమాచారం.
మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే సామ్ పెట్టే మరో పోస్ట్ కోసం వేచి చూడాలి. కాగా, సమంత తన వైవాహిక జీవితానికి సంబంధించి తీసుకున్న నిర్ణయం పట్ల ఆమెని తప్పు పడుతున్నారు. సోషల్ మీడియాలో ఎంత ఫ్రీ హ్యాండ్ ఉన్నా ఒకరి వ్యక్తిగత విషయాల్లోకి ఎంటరై జడ్జ్ చేయాల్సిన అవసరం ఎవరికైనా ఎందుకుండాలి కొంతమంది నెటిజన్లు సమంతకు సపోర్ట్‌గా నిలబడుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com