Samantha: కసరత్తులు మొదలెట్టిన సమంత

Samantha: కసరత్తులు మొదలెట్టిన సమంత
X
మయోసైటిస్ అనే ఆటో ఇమ్యూన్ వ్యాధితో భాదపడుతున్న సమంత కొన్ని రోజుల క్రితం సినిమాలకు బ్రేక్ ఇస్తున్నట్లు వెల్లడించి అభిమానుల్ని ఆశ్చర్యపరిచింది.

టాలీవుడ్ అందాల భామ సమంత గత కొన్ని రోజులుగా ఇండోనేషియాలోని బాలిలో హాలిడే ట్రిప్‌లో స్నేహితురాళ్లతో కలిసి ఎంజాయ్ చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులతో ఎప్పటికప్పుడు పంచుకుంది. అయితే సమంత ఫిట్‌నెస్‌కి ఎంతగా ప్రాధాన్యం ఇస్తుందో అందరికీ తెలిసిందే. రెగ్యులర్‌గా కసరత్తులు చేస్తూ తనకు తెలిసిన ఫిట్‌నెస్ రహస్యాల్ని పంచుకుంటుంది. ఎక్కడికి వెళ్లినా వర్కౌట్లు చేయడం మాత్రం ఆపదు. ఇప్పుడు కూడా బాలీ నుంచి హాలిడే ట్రిప్‌ ముగించుకున్న వచ్చిన సామ్ జిమ్‌లో సాధన చేయడం మొదలు పెట్టింది. చేతిలో పిల్లిని పెట్టుకుని ఎక్సర్‌సైజ్ చేస్తున్న వీడియోని తన ఇన్‌స్టాగ్రాం అకౌంట్‌లో పోస్ట్ చేసింది.

తను బాలీ ట్రిప్‌లో ఉన్నా కూడా వర్కౌట్ ఆపలేదు. తన స్నేహితురాలితో కలిసి యోగా సాధన చేసింది.దీనికి సంబంధించి తన స్నేహితురాలు అనూష ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేసింది.

మయోసైటిస్ అనే ఆటో ఇమ్యూన్ వ్యాధితో భాదపడుతున్న సమంత కొన్ని రోజుల క్రితం సినిమాలకు బ్రేక్ ఇస్తున్నట్లు వెల్లడించి అభిమానుల్ని ఆశ్చర్యపరిచింది. విజయ్ దేవరకొండతో ఆమె నటించిన ఖుషీ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.






Tags

Next Story