Shaakuntalam First Look : 'శాకుంతలం' నుంచి సామ్ లుక్ వచ్చేసింది.. !

Shaakuntalam First Look :  శాకుంతలం నుంచి సామ్ లుక్ వచ్చేసింది.. !
Shaakuntalam First Look : క్రియేటివ్ డైరెక్టర్‌ గుణశేఖర్‌ దర్శకత్వంలో సమంత మెయిన్ లీడ్ లో 'శాకుంతలం' అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే..

Shaakuntalam First Look : క్రియేటివ్ డైరెక్టర్‌ గుణశేఖర్‌ దర్శకత్వంలో సమంత మెయిన్ లీడ్ లో 'శాకుంతలం' అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. ఎట్టకేలకు ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. సినిమా నుంచి సమంత ఫస్ట్ లుక్ ని మేకర్స్ రిలీజ్ చేశారు.

ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో సమంత చాలా అందంగా ఉంది. ప్రకృతిలో వన్యప్రాణుల మధ్య దేవకన్యలా కనిపిస్తుంది సామ్.. కాగా ఈ సినిమాను దిల్‌ రాజు ప్రొడక్షన్స్‌, గుణాటీమ్‌ వర్క్స్‌ పతాకాలపై దిల్‌రాజు, నీలిమ గుణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఇందులో అల్లు అర్జున్ , స్నేహ దంపతుల కుమార్తె అల్లు అర్హ కీ రోల్ పోషిస్తుంది. ఇప్పటికే షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా రిలీజ్ కి సిద్దమవుతోంది. పాన్ ఇండియా మూవీగా వస్తోన్న ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. సినిమా పైన భారీ అంచనాలున్నాయి.

Tags

Next Story