సినిమా

Samantha My Mom Said: మీ కూతురిని ఎవరు పెళ్లి చేసుకుంటారు..: సమంత పోస్ట్ వైరల్

Samantha My Mom Said: మై మామ్ సెడ్ అనే హ్యాష్ ట్యాగ్‌తో తాను ప్రస్తుతం ఎదుర్కొంటోన్న పరిస్థితులను వివరించే ప్రయత్నం చేస్తోంది.

Samantha My Mom Said: మీ కూతురిని ఎవరు పెళ్లి చేసుకుంటారు..: సమంత పోస్ట్ వైరల్
X

Samantha My Mom Said: స్టార్ హీరోయిన్ సమంత సింగిల్‌గా ఉన్నా సెకను కూడా వేస్ట్ చేయకుండా తనకిష్టమైన పనులు చేస్తోంది. సినిమా షూట్స్‌లో పాల్గొంటూ, యాడ్స్ చేస్తూ తనని తాను బిజీగా ఉంచుకుంటోంది. వరుస పోస్టులు చేస్తూ తన మనసులో భావాల్ని, బాధని అభిమానులతో పంచుకుంటోంది. ఈ మధ్య తన క్లోజ్ ఫ్రెండ్‌తో కలిసి ఛార్ థామ్ విహార యాత్రకు వెళ్లి వచ్చింది.

విడాకుల అనంతరం జరిగిన పరిణామాలతో ఇబ్బంది పడిన సమంత పుణ్య క్షేత్రాల సందర్శనతో మనసుకి స్వాంతన చేకూరుస్తోంది. యాత్ర ముగించుకుని వచ్చిన అనంతరం సమంత కుంచె పట్టుకుని చక్కని చిత్రాలు గీస్తూ, అభిమానులకు ఆ వీడియోలను షేర్ చేస్తోంది. తాజాగా సమంత చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మై మామ్ సెడ్ అనే హ్యాష్ ట్యాగ్‌తో తాను ప్రస్తుతం ఎదుర్కొంటోన్న పరిస్థితులను వివరించే ప్రయత్నం చేస్తోంది.

మీ కూతురుని ఎవరు పెళ్లి చేసుకుంటారో.. ఎలాంటి వరుడు వస్తాడో అని కంగారు పడకండి. ఆమెని సమర్ధవంతంగా తీర్చిదిద్దండి. పెళ్లి కోసం డబ్బు ఆదా చేసే బదులు తన చదువు కోసం ఖర్చు పెట్టండి. పెళ్లి కోసం ఆమెను సిద్ధం చేసే ముందు తన కోసం తనని సిద్ధం చేయండి. అలాగే తనని తాను ప్రేమించుకోవడం, ఆత్మవిశ్వాసంతో ఉండడం నేర్పించండి. అలాగే ఇతరులకు అవసరం ఉన్న సమయంలో తను మార్గదర్శకంగా ఉండేలా సిద్ధం చేయండి అని సమంత రాసుకొచ్చింది.

Next Story

RELATED STORIES