Samantha: మియామీ మ్యూజిక్ ఫెస్ట్ లో సమంత ఊ అంటావా..

Samantha: మియామీ అల్ట్రా మ్యూజిక్ ఫెస్టివల్‌లో పుష్ప పాటకు ప్రేక్షకులు ఊగిపోతున్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఆ పాటకు ఉన్న ఆదరణను చూసి సమంత ఉప్పొంగి పోతోంది. ఈ వీడియోను సమంత షేర్ తన ఇన్ స్టాలో షేర్ చేసింది
అల్లు అర్జున్ పుష్ప సినిమాలో సమంత చేసిన ఐటెం సాంగ్ ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. సమంత ఇప్పటి వరకు చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తైతే ఈ ఒక్కపాట ఒక ఎత్తు. తన క్రేజ్ ని అమాంతం పెంచేసింది. పుష్ప సినిమాకి ఈ పాట, ఆమె డ్యాన్స్ పెద్ద ప్లస్ పాయింట్ అయ్యింది. తాజాగా మియామీలోని అల్ట్రా మ్యూజిక్ ఫెస్టివల్ 2022లో ఊ అంటావా పాట ప్లే అవుతున్న వీడియోలను సామ్ షేర్ చేసింది.
పుష్పలోని ఊ అంటావా పాటలో సమంత హాట్‌గా కనిపించింది. ఆమె గెటప్, ఆమె కాన్ఫిడెన్స్ పాటకు అద్భుతమైన రెస్పాన్స్ తీసుకువచ్చింది. ప్రస్తుతం మయామిలో ఉన్న అల్ట్రా మ్యూజిక్ ఫెస్టివల్ 2022కి సమంత హాజరయ్యారు.
వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. సమంత "ఇది ఒక ప్రత్యేకమైన ప్రత్యేక విజయం. చాలా ఆనందంగా ఉంది" అని రాసుకొచ్చింది.
ఈ పాట భారీ విజయాన్ని సాధించడం వెనుక చాలా మంది కృషి ఉంది. అల్లు అర్జున్ పుష్ప డిసెంబర్ 17, 2021న విడుదలైంది. ఆ సంవత్సరం అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో పుష్ప ఒకటి.
😳 Are you sure this is #ultramiami .. 😱😱😱 https://t.co/gpWui0Ruwz
— Samantha (@Samanthaprabhu2) March 27, 2022
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com