Samantha EMK Promo: ఎన్టీఆర్ ప్రశ్నతో సమంత షాక్.. ముందే ఎందుకు చెప్పలేదంటూ..

Samantha EMK Promo: ఎన్టీఆర్ ప్రశ్నతో సమంత షాక్.. ముందే ఎందుకు చెప్పలేదంటూ..
Samantha EMK Promo : నాగచైతన్యతో విడాకుల తరువాత సమంత కొద్ది రోజులు ఎలాంటి షూటింగ్స్ లో పాల్గోలేదు.

Samantha EMK Promo : నాగచైతన్యతో విడాకుల తరువాత సమంత కొద్ది రోజులు ఎలాంటి షూటింగ్స్ లో పాల్గోలేదు. బయటకు రాలేదు. కానీ ముందే ఈ పరిణామాలకు సిద్ధపడినట్టు తెలుస్తోంది. అందుకే ఎన్టీఆర్ హోస్ట్ గా చేస్తున్న ఎవరు మీలో కోటీశ్వరుడు షో కు గెస్ట్ గా వచ్చింది. షూటింగ్ రోజున కూడా తనకు తాను సర్దిచెప్పుకుని హాట్ సీట్లో కూర్చుంది.

ఎన్టీఆర్ మాత్రం షో జరుగుతున్నంతసేపూ నవ్వుతున్నట్టే కనిపించారు. సమంతతో ఫన్నీ చాట్ చేస్తూనే.. హాట్ సీట్లో ఉన్న ఫీలింగ్ ఆమెకు రాకుండా జాగ్రత్తపడ్డారు. మామూలుగా ఎవరైనా వెయ్యి నుంచి కోటికి వెళతారు.. నువ్వు కోటి నుంచి వెయ్యికి వస్తావు.. ఎంత బాగుంటుందో కదా ఆట అంటూ ఎన్టీఆర్ అనేసరికీ సమంతకు నవ్వు ఆగలేదు.

మధ్యలో ఓ చోట.. వద్దులే నాకు డబ్బు అని సమంత అనడంతో.. వద్దా అని ఎన్టీఆర్ క్వశ్చన్ చేశారు. దీంతో కంగారుపడ్డ సమంత.. కావాలి కావాలి అంటూ చెప్పేసరికీ ఇద్దరికీ నవ్వాగలేదు. ఆ వెంటనే ఎన్టీఆర్.. సమంతను ఉద్దేశించి క్విట్ అయిపోతావా అంటూ క్వశ్చన్ చేసేసరికీ సమంత ఒక్కసారిగా షాక్ అయ్యింది.

ఎన్టీఆర్ క్వశ్చన్ కు అంతే ఘాటుగా ఆన్సరిచ్చింది సమంతా. ఇప్పుడు చెబుతున్నారు.. ముందే చెప్పాలి కదా అంటూ ఓ క్యూట్ ఎక్స్ ప్రెషన్ ఇచ్చింది. ఆ ఎక్ ప్రెషన్ లో.. బాధ, ఆవేదన అన్నీ కనిపిస్తున్నాయి. కానీ ప్రోమో చూస్తుంటే.. అంతా ఆ ఆన్సర్ ను విని సమంత ఏ ప్రశ్నకు అలాంటి ఆన్సర్ ఇచ్చి ఉంటుందా అని ఆలోచనలో పడేలా ఉంది.

మొత్తానికి సమంత మళ్లీ ఇలా హుషారుగా ఉంటూ.. నవ్వూతూ, ఓ షోలో పాల్గోవడంతో సామ్ ఫ్యాన్సంతా ఫుల్ ఖుషీ అయిపోయారు. శభాష్ సామ్.. అంత బాధను కూడా గుండెల్లో దాచుకుని.. మా ఎంటర్ టైన్ మెంట్ కోసం నువ్వు ఇలా నవ్వుతున్నావంటే.. యూ ఆర్ గ్రేట్ అంటూ అభినందనలతో ముంచెత్తుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story