సమంత సారీ చెప్పాలి..: సీనియర్ నటుడు

సమంత సారీ చెప్పాలి..: సీనియర్ నటుడు
సినిమా అయినా, సీరీస్ అయినా ఎవరి మనోభావాలు దెబ్బ తీయకుండా చూడాలని జాగ్రత్త పడుతుంటారు దర్శక నిర్మాతలు.

సినిమా అయినా, సీరీస్ అయినా ఎవరి మనోభావాలు దెబ్బ తీయకుండా చూడాలని జాగ్రత్త పడుతుంటారు దర్శక నిర్మాతలు. అయినా ఎక్కడో ఒక చోట కొన్ని కొన్ని సంఘటనలు వివాదానికి తెర లేపుతుంటాయి. తాజాగా సమంత అక్కినేని నటించిన వెబ్ సిరీస్ 'ఫ్యామిలీ మేన్-2' ప్రేక్షకుల నిరాజనాలు అందుకుంటోంది. ఈ సిరీస్‌లో సమంత నటన హైలెట్‌గా నిలుస్తోంది.

ఈ క్రమంలో కోలీవుడ్ సీనియర్ నటుడు మనోబాల సమంతను తమిళ ప్రేక్షకులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సిరీస్ తమిళ ప్రజల మనోభావాలను దెబ్బతీసేదిగా ఉందని ఇప్పటికే పలువురి నుంచి విమర్శలు ఎదురవుతున్నాయి. ఇక ఇదే విషయమై మనోబాల కూడా స్పందించారు. ఈ సిరీస్‌లో నటించినందుకు సమంత తప్పకుండా క్షమాపణలు చెప్పి తీరాలి అని అంటున్నారు.రాజీ పాత్ర విషయంలో చిత్ర యూనిట్ సామ్‌ను మోసం చేసింది. ఓ పోరాట యోధురాలిగా ఆమెకు ఈ పాత్ర గురించి వివరించినప్పటికీ.. ఈలం పోరాట క్షీణతను తెలియజేసే విధంగా దీన్ని చిత్రీకరించారు. కథను ఒప్పుకునేముందు సమంత కూడ ఆలోచించి ఉండాల్సింది. సామ్ సారీ చెప్పడంతో పాటు చిత్ర బృందం పూర్తి బాధ్యత తీసుకునే వరకు సిరీస్‌కు వ్యతిరేకంగా మేం పోరాటం చేస్తూనే ఉంటామని మనోబాల తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story