Samantha : రూమర్స్ కు చెక్ పెట్టిన సామ్

అక్కినేని నాగ చైతన్య, శోభితా ధూళిపాళ్ల ఎంగెజ్మెంట్ తర్వాత ఒక్క సారిగా ట్రెండింగ్లోకి వచ్చింది చైతు మాజీ భార్య సమంత. ఓ వైపు ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుంటూనే మరో వైపు కెరీర్ పై దృష్టి పెట్టిందీ అమ్మడు. నాగచైతన్య ఎంగేజ్మెంట్ తర్వాత సమంత నుంచి ఏమైనా అప్డేట్ వస్తుందా..? అని చాలా మంది ఎదురు చూశారు. కానీ సింపుల్ గా అమె పోస్టు చేసిన ఫొటో ఇప్పుడు ట్రెండిగ్ సబ్జెక్టయ్యింది. 'ద మ్యూజియం ఓపెన్.. పీస్ అండ్ క్విట్ ' అని రాసి ఉన్న టీషర్టు, గాగుల్స్ ధరించి ఉన్న THE MUSEUM SPEACE & QU' ఫొటోను పోస్ట్ చేసింది. సాధారణంగా సమంత తనకు నచ్చని అంశాల విషయంలో చాలా పదునైన సమాధానాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది. ఇక ఇప్పుడు రూమర్స్ గురించి ఆమె పెద్దగా సీరియస్ అవ్వకుండా మౌనంగా ఉంటూనే ఇలా సమాధానం ఇచ్చింది. ప్రస్తుతం ఆమె కెరీర్ మంచి ట్రాక్ లోనే కొనసాగుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com