Samantha: సమంత ఓ సెకండ్ హ్యాండ్ ఐటమ్ అంటూ నెటిజన్ కామెంట్.. సామ్ కూల్ రిప్లై

Samantha: కొందరంతే.. సంతోషంగా ఉంటే చూడలేరు.. జీవితంలో ఎదురైన పరిస్థితుల్ని తలుచుకుని బాధపడుతూ కూర్చుంటే వాళ్లకి ఇష్టం. తాజాగా సమంత విషయంలో ఓ నెటిజన్ అలాగే ట్రీట్ చేశాడు. తన ఇంట్లో పరిస్థితులు ఏంటో మనకు తెలియదు.
ఆమె ఎందుకు విడాకుల నిర్ణయం తీసుకుందో అంతకంటే తెలియదు.. అయినా బ్యాడ్ కామెంట్ చేస్తూ ఆమెని బాధపెట్టే పోస్టులు.. అందర్నీ నివారించలేదు.. అయినా కోర్టులో కేసు వేసింది.. ఇంకా కామెంట్ చేయడం ఆపలేదు సదరు నెటిజన్లు.. ఓ వ్యక్తి ట్విట్టర్‌లో సామ్‌ని ట్యాగ్ చేస్తూ 'సమంత ఒక సెకండ్ హ్యాండ్ ఐటమ్'.. ఓ జెంటిల్‌మెన్ వద్ద విడాకుల పేరుతో రూ.50 కోట్ల పన్ను రహిత డబ్బు దోచుకున్న వ్యక్తి అని ట్వీట్ చేశాడు.
దీనికి సామ్ ఏమాత్రం ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వదలుచుకోలేదు.. అతడిని బాధ పెట్టే మాటలు కూడా మాట్లాడకుండా.. ఎవరి మానాన వాళ్లే పోతారనుకుందో ఏమో.. 'గాడ్ బ్లెస్ యువర్ సోల్' అని కూల్‌గా రిప్లై ఇచ్చింది.
సమంతని తరచుగా సోషల్ మీడియాలో టార్గెట్ చేస్తున్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ తన అస్థిత్వాన్ని కోల్పోకుండా తనని తాను ధృఢంగా మార్చుకుంటుంది. ప్రస్తుతం ఆమె అల్లు అర్జున్ ' పుష్ప' చిత్రంలో చేసిన ఐటెం సాంగ్ 'ఊ అంటావా..ఊ ఊ అంటావా' సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది.
Kamarali Dukandar God bless your soul . https://t.co/IqA1feO9K1
— Samantha (@Samanthaprabhu2) December 21, 2021
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com