సినిమా

Samantha: సామ్‌కు బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ బంపర్ ఆఫర్.. ఏకంగా మూడు సినిమాల్లో..

Samantha: ఫ్యామిలీ మ్యాన్‌తో బాలీవుడ్‌లో ఫేమ్ దక్కించుకున్న సమంతను హీరోయిన్‌గా అక్కడి ప్రేక్షకులకు పరిచయం కానుంది.

Samantha (tv5news.in)
X

Samantha (tv5news.in)

Samantha: సమంత అంటే ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో మాత్రమే ఫేమస్. కానీ ఇప్పుడు సౌత్‌తో పాటు నార్త్‌లో కూడా ఓ వెలుగు వెలిగిపోతోంది ఈ భామ. దానికి కారణం ఫ్యామిలీ మ్యాన్ అనే ఒక్క వెబ్ సిరీస్. ఈ సిరీస్‌లో సమంత అంతకు ముందెన్నడూ చేయని రోల్‌ను చేసింది. ఇందులో రాజీ లాంటి ఒక ఛాలెంజింగ్ పాత్రలో సమంత తన నటనతో అందరినీ పూర్తిగా మెప్పించింది. అందుకే ప్రస్తుతం బాలీవుడ్ బడా నిర్మాతల కళ్లన్నీ సమంతపైనే ఉన్నాయి.

ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ సూపర్ హిట్ అవ్వడంతో.. దానిని తెరకెక్కించిన దర్శకులు రాజ్, డీకేతోనే మరో వెబ్ సిరీస్ చేయడానికి సిద్ధమయ్యింది. ఇందులో తాను బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్‌కు జోడీగా నటించనుందని కూడా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం సౌత్‌లోనే బిజీగా గడిపేస్తు్న్న సమంత.. ఇక్కడ తన అప్‌కమింగ్ చిత్రాలు పూర్తయిన తర్వాత ఈ వెబ్ సిరీస్ సెట్స్‌లో అడుగుపెట్టనుందని సమాచారం. అంతలోనే సమంతకు మరో బాలీవుడ్ బిగ్గెస్ట్ ఆఫర్ వచ్చిందట.

బాలీవుడ్‌లో చాలామంది నటీనటులు యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మాణంలో సినిమాలు చేయాలనుకుంటారు. ఒక్కసారి ఈ నిర్మాణ సంస్థతో చేయి కలిపితే.. ఇక వారి లైఫ్‌ సెట్ అయిపోయినట్టే అని ఎంతోమంది అప్‌కమింగ్ ఆర్టిస్టులు అనుకుంటారు. అలాంటి నిర్మాణ సంస్థ ప్రస్తుతం సమంత డేట్ల కోసం ఎదరుచూస్తోందట.

ఫ్యామిలీ మ్యాన్ సిరీస్‌తో బాలీవుడ్‌లో ఫేమ్ దక్కించుకున్న సమంతను హీరోయిన్‌గా అక్కడి ప్రేక్షకులకు పరిచయం చేయాలని యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్ణయించుకుందట. అందుకే ఒకేసారి సమంతతో ఏకంగా మూడు సినిమాలు సైన్ చేయించునట్టు సమాచారం. సమంత కూడా బాలీవుడ్‌లో తానేంటో నిరూపించుకోవాలి అనుకుంటుంది తాను కూడా వెంటనే ఈ ఆఫర్‌కు ఓకే చెప్పేసినట్టు ఫిల్మ్ సర్కిల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Divya Reddy

Divya Reddy

Divya reddy is an excellent author and writer


Next Story

RELATED STORIES