Samantha: ఇద్దరు హీరోయిన్ల మల్టీస్టారర్.. ఒకరు తెరపైన.. మరొకరు తెర వెనుక..

Samantha (tv5news.in)
Samantha: సమంత రుత్ ప్రభు తన పర్సనల్ లైఫ్‌లో జరుగుతున్న గందరగోళాలను పక్కన పెట్టి పూర్తిగా కెరీర్‌పైన దృష్టిపెట్టింది. వరుసగా సినిమాలను సైన్ చేస్తోంది. వెబ్ సిరీస్‌లతో కూడా బిజీ అయ్యే ఆలోచలనో ఉంది. పైగా ఫ్యామిలీ మ్యాన్ తర్వాత సామ్‌కు బాలీవుడ్ నుండి కూడా చాలానే ఆఫర్లు వస్తున్నాయి. ఇటీవల మరో హారోయిన్‌తో కలిసి సమంత ఒక సినిమా చేయనుందని టాక్ వినిపిస్తోంది.
నటీనటులు ఒకపక్క యాక్టింగ్ చేస్తూనే.. మరోపక్క సినిమాలను కూడా నిర్మిస్తున్నారు. తాము నటించినవి మాత్రమే కాకుండా కంటెంట్ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్లి.. నిర్మాతలుగా ఆ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని తాపత్రయపడుతున్నారు. ఆ ఉద్దేశ్యంతోనే క్యూట్ బ్యూటీ తాప్సీ కూడా ఇటీవల నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. అయితే ప్రొడ్యూసర్ తాప్సీ.. సమంతకు కాదనలేని బంపర్ ఆఫర్ ఇచ్చిందట.
తాప్సీ హీరోయిన్‌గా అడుగుపెట్టింది టాలీవుడ్‌లోనే అయినా.. మెల్లగా తన అడుగులు బాలీవుడ్ వైపు పడ్డాయి. ప్రస్తుతం బాలీవుడ్‌లోని మోస్ట్ వాంటెడ్ హీరోయిన్లలో తాప్సీ కూడా ఒకరు. వరుసగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో అందరినీ ఇంప్రెస్ చేసిన తాప్సీ.. నిర్మాతగా కూడా నిలదొక్కుకోవడానికి ప్రయత్నం చేస్తోంది. ఇదే క్రమంలో తాను సమంతతో ఒక సినిమా ప్లాన్ చేసిందని టాక్ వినిపిస్తోంది.
తాప్సీ ఔట్‌సైడర్స్ సినిమా నిర్మాణ సంస్థ ద్వారా సమంతకు ఒక ఆఫర్ ఇచ్చిందట. అది కూడా ఒక హిందీ సినిమాలో హీరోయిన్‌గా చేయాలని అడిగిందట. ఎలాగో బాలీవుడ్‌లో కూడా సెటిల్ అవ్వాలనుకుంటున్న సమంత ఈ ఆఫర్‌కు ఓకే చెప్పిందని టాక్. అన్నీ ఓకే అయితే త్వరలోనే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది. ఒక యంగ్ బ్యూటీ హీరోయిన్‌గా, మరో యంగ్ బ్యూటీ నిర్మాతగా తెరకెక్కనున్న ఈ సినిమా మంచి మల్టీస్టారర్ లాంటిదే అని నెటిజన్లు అనుకుంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com