Sam - Vijay: ఆకట్టుకుంటోన్న 'ఆరాధ్య'

Sam - Vijay: ఆకట్టుకుంటోన్న ఆరాధ్య
సెప్టెంబర్ 1న ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ్, మళయాల, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది


విజయ్ దేవరకొండ, సమంత నటించిన 'ఖుషి' నుంచి 'ఆరాధ్య' పాటను విడుదల చేసింది చిత్ర యునిట్. ఇప్పటికే ఈ సినిమా మీద మంచి హైప్ ఏర్పడింది. తాజాగా ఈ చిత్రం నుంచి రెండో పాటను రిలీజ్ చేశారు. ఆరాధ్య అంటూ సాగే ఈ పాట ప్రేమికుల గీతంగా నిలిచిపోయేలా ఉంది. ఈ పాటను శివ నిర్వాణ తెలుగులో రాయగా.. తమిళంలో మదన్ కార్కీ సాహిత్యాన్ని అందించాడు. తెలుగు, తమిళంలో సిధ్ శ్రీరామ్, చిన్మయి ఆలపించారు. ఈపాటలో సమంత, విజయ్ కెమిస్ట్రీ మరింతగా హైలెట్ అవుతోంది. మరీ ముఖ్యంగా శివ నిర్వాణ కొరియోగ్రఫీ ఆకట్టుకుంటుంది.

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. సమంత విజయ్ లు కలిసి నటిస్తుండటంతో ఈ చిత్రానికి సంబంధించిన ప్రతీ అప్డేట్‌ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉంది. ఇప్పటికే 'నా రోజా నువ్వే' అనే పాట యూట్యూబ్‌లో వంద మిలియన్లకు చేరువలో ఉంది. సెప్టెంబర్ 1న ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ్, మళయాల, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది.




Tags

Read MoreRead Less
Next Story