Samantha vs Sree Leela : సమంత వర్సెస్ శ్రీ లీల.. కొన్ని నిజాలు

Samantha vs Sree Leela :    సమంత వర్సెస్ శ్రీ లీల.. కొన్ని నిజాలు
X

పుష్ప 2... ప్రస్తుతం టాక్ ఆఫ్ ద కంట్రీ అయిపోయింది. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నభూతో అన్నట్టుగా ఉండటంతో కొంతమంది సినిమా స్టార్స్ ఆ రాత్రి నిద్రే పట్టలేదు అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకూ ప్యాన్ ఇండియా హీరోలం అని చెప్పుకున్న ఏ స్టార్ కూ అంత జనం రాలేదు. బిహార్ లోని పాట్నాలో జరిగిన ఈవెంట్ కు సపోర్ట్ గా కొన్ని రాష్ట్రాల్లో కేవలం ప్రేక్షకులు, అల్లు అర్జున్ ఫ్యాన్సే సంబరాలు చేసుకోవడం కూడా కనిపించింది. అయితే ట్రైలర్ కు ముందు, తరవాత కూడా చాలా చర్చలు వస్తున్నాయి. అందులో ఒకటి.. పుష్ప 1లో ఐటమ్ సాంగ్ చేసిన సమంతను, పుష్ప 2 స్పెషల్ సాంగ్ చేసిన శ్రీలీల మ్యాచ్ చేస్తుందా అనేది స్ట్రాంగ్ గా వినిపిస్తోంది. అయితే అసలు ఈ మ్యాచింగ్ డిస్కషన్సే అవసరం లేదు అనేది వాస్తవం.

సమంత చేసిన పాట కేవలం ఐటమ్ సాంగ్. సినిమాకు ఏ మాత్రం ఉపయోగపడలేదు. అయినా పాట ఎందుకు అంత హిట్ అయిందీ అంటే.. అంతకు ముందెప్పుడూ లేనంతగా సమంత విపరీతమైన ఎక్స్ పోజింగ్ చేసింది. ఆ స్థాయిలో తనెప్పుడూ అంత స్కిన్ షో చేయలేదు. దీనికి తోడు.. అదే సమయంలో తన విడాకులు అయింది. అప్పటికే కంట్రీ మొత్తం హాట్ టాపిక్ గా ఉంది సమంత విడాకుల మేటర్. అందువల్ల పాటకు అంతులేని క్రేజ్ వచ్చింది. ఈ పాట సినిమా కథకు ఉపయోపడింది కాదు. జస్ట్ టైమ్ ఫిల్లర్ మాత్రమే. అయినా అంత క్రేజ్ ఎందుకు వచ్చిందంటే ఇవే కారణాలు.

ఇక శ్రీలీల గురించి చూస్తే తనకు సమంత అంత క్రేజ్ ఇంకా రాలేదు. మొహంలో పసితనపు ఛాయలు కనిపిస్తున్నాయి. అందుకే సమంతను మ్యాచ్ చేయలేదు అంటున్నారు. బట్ ఆ అవసరమే లేదు అనేది నిజం. ఎందుకంటే శ్రీ లీల తనకు ఇచ్చిన పనిని చేస్తుంది తప్ప.. ఎవరినో మ్యాచ్ చేయాలని చూడాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలో తన పాటకు సంబంధించి తన పరిమితులకు లోబడిన కాస్ట్యూమ్స్ తోనే కనిపిస్తుంది. అలాగే ఈ పిల్ల పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చేది డ్యాన్సులు. అటు అల్లు అర్జున్ సూపర్ డ్యాన్సర్. ఈ ఇద్దరూ కలిసి డ్యాన్స్ ఆడితే ఆడియన్స్ కు కన్నుల పండగలా ఉంటుంది అనేదే మేకర్స్ కోణం అయి ఉంటుంది.

శ్రీ లీలతో పోలిస్తే సమంత అంత పెద్ద డ్యాన్సర్ ఏం కాదు. ఈ విషయంలో పోలికలు పెడితే అప్పుడు సమంతకూ మైనస్ మార్కులు పడతాయి కదా..? సో.. ఇద్దరి మధ్య అసలు కంపేరిజన్సే అవసరం లేదు. ఆ సినిమాకు ఆ పాట ఎంత ఉపయోగపడిందో.. ఈ సినిమాకు ఈ పాట ఎంత మైలేజ్ ఇస్తుంది అనేదే క్రైటీరియా అవుతుంది తప్ప.. ఒకరిని ఒకరు మ్యాచ్ చేసుకోవాల్సిన అవసరం అస్సలు లేదు. ఆ మాటకొస్తే.. సమంత క్రేజ్ కు కారణం కేవలం విపరీతమైన ఎక్స్ పోజింగే అనేవారూ లేకపోలేదు. ఆ స్థాయిలో శ్రీ లీల కూడా స్కిన్ షో చేస్తే ఆటో మేటిక్ గా అందరి దృష్టీ అటే వెళుతుంది. కానీ ట్రైలర్ లో కట్స్ చూస్తే శ్రీ లీల.. సమంత కంటే కాస్త హద్దుల్లోనే ఉన్నట్టు కనిపిస్తోంది.

Tags

Next Story