Samantha Ruth Prabhu: సమంత 'మహాసముద్రం' నుండి తప్పుకోవడానికి ఇదే కారణమా..?

Samantha Ruth Prabhu: ఈవారం చాలా తెలుగు సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. అందులో ఒకటి మహాసముద్రం. సిద్ధార్థ్, శర్వానంద్ మల్టీ స్టా్రర్‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని అజయ్ భూపతి డైరెక్ట్ చేసారు. వారికి జంటగా అను ఇమాన్యుయల్, అదితి రావ్ హైదరీ నటించారు. అయితే ఈ సినిమాకు ముందుగా అనుకున్న హీరోయిన్ అదితి కాదట.. సమంత అట.. మరి సామ్ ఈ సినిమా నుండి ఎందుకు తప్పుకుంది అన్న వార్త మరోసారి తెరపైకి వచ్చింది.
సమంత రుత్ ప్రభు.. తన ప్రొఫెషనల్ లైఫ్ గురించి కంటే పర్సనల్ లైఫ్ గురించే ప్రస్తుతం ప్రేక్షకులు ఎక్కువగా మాట్లాడుతున్నారు. అయినా సామ్ అవేవీ పట్టించుకోకుండా తన కెరీర్‌లో బిజీగా ఉంది. ప్రస్తుతం ఉమెన్ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తున్న సమంత దగ్గరకే ముందుగా మహా సముద్రం స్క్రిప్ట్ వచ్చిందట. ముందుగా తాను కూడా ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా తరువాత పలు కారణాల వల్ల తప్పుకుందట.
మహా సముద్రం స్క్రిప్ట్‌ను శర్వానంద్ కంటే ముందు నాగచైతన్యకు వినిపించాడు అజయ్ భూపతి. సామ్, నాగచైతన్య కలిసి ఈ సినిమా చేయాల్సింది. కానీ అనుకోకుండా చైతూ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడు. ఆ తరువాత రవితేజను సంప్రదించినా అది కూడా వర్కవుట్ అవ్వలేదు. చివరిగా మహా సముద్రం స్క్రిప్ట్ శర్వా చేతికి వచ్చింది.
అప్పటికే సమంతను హీరోయిన్‌గా ఫైనల్ చేసింది మూవీ టీమ్. హీరోగా శర్వా ఫైనల్ అయ్యాడు. అప్పటికే శర్వానంద్, సమంత 'జాను'లో కలిసి నటించారు. ఆ సినిమా '96'కు పర్ఫెక్ట్ రీమేక్ అని ప్రశంసలు వచ్చినా.. ఆశించినంతగా ఆడలేదు. అంతే కాకుండా వీరి పెయిర్‌కు కూడా కాస్త నెగిటివ్ టాక్ వచ్చింది. దీంతో సమంత మహా సముద్రం నుండి తప్పుకుంది. ఆ తర్వాత అజయ్ భూపతి తన స్థానంలో అదితి రావును తీసుకున్నాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com