Samantha: అప్పుడు సమంతనే కావాలన్నాడు.. ఇప్పుడు వద్దంటున్నాడు..
Samantha (tv5news.in)
Samantha: అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన 'పుష్ప' సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా ఇంతగా హిట్ అవ్వడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అందుకే సమంత చేసిన స్పెషల్ సాంగ్ కూడా ఒక కారణమే. అసలు సమంత ఒక ఐటెమ్ సాంగ్ చేయడానికి ఒప్పుకుంది అన్న విషయమే ఈ చిత్రంలో స్పెషల్ సాంగ్‌కు హైప్‌ను క్రియేట్ చేసింది.
ముందుగా పుష్ప చిత్రంలో స్పెషల్ సాంగ్ కోసం ఎవరో ఒక బాలీవుడ్ భామను ఎంపిక చేయాలనుకున్నాడట సుకుమార్. అలా పలువురి భామల పేర్లను కూడా పరిశీలించాడట. కానీ ఎవరిని తీసుకుంటే సాంగ్‌కు హైప్ వస్తుందో అర్థం కాని సుకుమార్.. చాలారోజులు వెయిట్ చేశాడు. ఫైనల్‌గా సమంత అప్పుడు లైమ్ లైట్‌లో ఉంది. సమంత ఏం చేసిన సెన్సేషన్ అవుతుంది. అందుకే పుష్పకు ప్లస్ అవ్వడం కోసం సమంతకు ముందుగా ఇష్టం లేకపోయినా ఐటెమ్ సాంగ్ కోసం ఒప్పించాడు సుకుమార్.
ఫైనల్‌గా సమంత ఐటెమ్ సాంగ్ చేస్తుంది అన్న వార్త బయటికి వచ్చినప్పటి నుండి ఆ పాట కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూడడం మొదలుపెట్టారు. ఇక పాట విడుదలయిన తర్వాత ప్రేక్షకులు ఊహించినదానికంటే ఇది డబుల్ ఉండడంతో వారు కూడా దీనిని టాప్‌లో పెట్టారు. అయితే పుష్ప 2లో మాత్రం సమంత ఉండబోదని సమాచారం.
సమంత వల్ల పుష్ప పార్ట్ 1లో ఐటెమ్ సాంగ్‌కు విపరీతమైన క్రేజ్ వచ్చింది. అయితే పుష్ప 2లో కూడా కచ్చితంగా ఐటెమ్ సాంగ్ ఉండే ఛాన్స్ ఉంది. అయితే పుష్ప ఇప్పటికే హిందీలో పెద్ద హిట్ అవ్వడంతో అక్కడి భామలు కూడా రెండో భాగంలో ఐటెమ్ సాంగ్ చేయడానికి ఆసక్తి చూపిస్తారు. అందుకే సుకుమార్ ఒక బాలీవుడ్ భామను ఈ స్పెషల్ సాంగ్ కోసం ఎంపిక చేయనున్నాడని టాక్.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com