Samantha Yashoda: ఓటీటీలోకి యశోద వచ్చేస్తోంది..

Samantha Yashoda: ఓటీటీలోకి యశోద వచ్చేస్తోంది..
Samantha Yashoda: సమంత ప్రధాన పాత్రలో నటించిన మూవీ యశోద. సరోగసి నేపథ్యంలో లేడీ ఓరియెంటెడ్‌ కథాంశంగా తెరకెక్కిన ఈ చిత్రానికి హరి-హరీష్‌ ద్వయం తెరకెక్కించారు.

Samantha Yashoda: సమంత ప్రధాన పాత్రలో నటించిన మూవీ యశోద. సరోగసి నేపథ్యంలో లేడీ ఓరియెంటెడ్‌ కథాంశంగా తెరకెక్కిన ఈ చిత్రానికి హరి-హరీష్‌ ద్వయం తెరకెక్కించారు. నవంబర్‌11న విడుదలైన ఈ సినిమా హిట్‌ టాక్ ను సొంతం చేసుకుంది.యశోద పాత్రలో గర్భిణిగా సమంత నటనకు మంచి మార్కులు పడ్డాయి. కాకపోతే వీకెండ్ తర్వాత థియేటర్స్ లో మరీ ఎక్కువ కలెక్షన్స్ కొల్లగొట్టలేకపోయిందీ మూవీ.


బట్ ఇది ఓటిటిలో బాగా కనెక్ట్ అవుతుందీ అని అప్పుడే అంతా అనుకున్నారు. కానీ దీంతో రూల్స్ కు భిన్నంగా చాలా త్వరగానే ఓటిటిలో వస్తుందని భావించారు చాలామంది. అటు మేకర్స్ కూడా అదే చేయాలనుకున్నారు. కానీ అనుకోని వివాదాలతో బాగా ఆలస్యం అయింది. ఈ మూవీలో చూపించిన ఈవా ఫౌండేషన్ వారు కేస్ వేయడంతో ఓ దశలో యశోద ఇంక ఓటిటిలో రాదు అని కూడా అనుకున్నారు.


బట్ ప్రతి సమస్యకూ ఓ పరిష్కారం ఉంటుంది కదా..? ఈ మూవీకి అలాంటి సొల్యూషన్ చూసుకున్నారు మేకర్స్. ఈవా ఫౌండేషన్ వారితో మాట్లాడుకుని వారికి ఇబ్బంది లేకుండా చూసుకుంటాం అని హామీ ఇచ్చారు. దీంతో వారు కేస్ ను వెనక్కి తీసుకున్నారు. కట్ చేస్తే ఇక ఓటిటి రిలీజ్ కు లైన్ క్లియర్ అయింది. గతంలో చెప్పిన టైమ్ కు రెండు వారాలు ఆలస్యంగా.. ఈ నెల 9నుంచి యశోద మూవీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కాబోతోంది. మరి థ్రిల్లింగ్ హిట్ అనిపించుకున్న యశోదకు ఓటిటి ఆడియన్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story