Citadel Honey Bunny Teaser : సమంత సిటాడెల్ టీజర్ ఎలా ఉంది..?

టాలెంటెడ్ బ్యూటీ సమంత మళ్లీ ఫామ్ లోకి వచ్చేస్తోంది. కొన్నాళ్లుగా రకరకాల వ్యక్తిగత సమస్యలతో బాధపడుతూ రికవర్ అయిన శామ్.. ఇక తన కెరీర్ పై ఫోకస్ చేసింది. ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ముందు సిటాడెల్ వెబ్ సిరీస్ రాబోతోంది. ద ఫ్యామిలీ మేన్ అనే సిరీస్ తో ఓవర్ నైట్ కంట్రీ మొత్తం ఫేమ్ అయిన రాజ్ - డీకే ద్వయం ఈ సిటాడెల్ సిరీస్ ను కూడా డైరెక్ట్ చేస్తున్నారు. సమంతకు జోడీగా వరుణ్ ధావన్ నటిస్తున్నాడు. చాలా రోజుల క్రితమే ఈ సిరీస్ షూటింగ్ స్టార్ట్ అయింది. బట్ సమంత హెల్త్ ఇష్యూ వల్ల కాస్త లేట్ అయింది. నవంబర్ 7 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కాబోతోన్న ఈ సిరీస్ టీజర్ విడుదల చేశారు.
హాలీవుడ్ లో రస్సో బ్రదర్స్ క్రయేట్ చేసిన సిటాడెల్ వెబ్ సిరీస్ కు ఇది ఇండియన్ వెర్షన్. హాలీవుడ్ లో ఎంత యాక్షన్ ఉంటుందో అంత రొమాన్స్, ఇంటిమేట్ సీన్స్ ఉంటాయి. ఆ మధ్య వచ్చిన ఆ సిరీస్ లో ఇండియన్ యాక్ట్రెస్ ప్రియాకం చోప్రా చాలా ఘాటుగా రెచ్చిపోయింది. ఇండియన్ వెర్షన్ లో కూడా సమంత అలాగే చేస్తుందని భావించారు చాలామంది. బట్ అలాంటిదేం లేదు. కంప్లీట్ యాక్షన్ ప్యాక్డ్ గా ఉందీ టీజర్. ఓ ఇంగ్లీష్ సాంగ్ బ్యాక్ గ్రౌండ్ లో వినిపిస్తోంటే.. సమంత, వరుణ్ ధావన్ ల యాక్షన్ మోతతో దద్దరిల్లిపోయిందీ టీజర్. ఓ చిన్న పిల్లతో పాట కేకే మీనన్ ప్రెజెన్స్ వీరి తర్వాత ఎక్కువగా కనిపించింది. అయితే సమంతతో హాట్ సీన్స్ ఉంటాయని గతంలో చెప్పారు. అయితే సర్ ప్రైజ్ ప్యాక్ గా సిరీస్ లోనే చూపిస్తారేమో కానీ.. సిటాడెల్ ఇండియన్ వెర్షన్ టీజర్ ఆకట్టుకునేలానే ఉంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com