Samantha : సమంత ఇంట్లో తీవ్ర విషాదం

Samantha :  సమంత ఇంట్లో తీవ్ర విషాదం
X

వెర్సటైల్ యాక్ట్రెస్ సమంత ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తండ్రి జోసెఫ్ ప్రభు కన్నుమూశాడు. సమంతకు తండ్రి అంటే చాలా ఇష్టం. ఆ విషయం ఎన్నో సందర్భాల్లో చెప్పింది కూడా. సమంత కెరీర్ ను నిర్మించుకునే టైమ్ లో ఆమెకు అండగా నిలిచింది కుటుంబమే. ఇక తన తండ్రి మరణ వార్తను ఆమె ఇన్ స్టాగ్రామ్ స్టేటస్ లో పెట్టింది. ‘అంటిల్ వి మెట్ అగెయిన్ డాడ్’(నాన్నా.. మళ్లీ మనం కలిసే వరకు)అనే లైన్ తో పాటు పగిలిన హృదయపు ఎమోజీని జోడించింది.

సమంత, చైతన్య విడాకులు టైమ్ లో జోసెఫ్ స్పందించిన విధానం చాలామందికి నచ్చింది. సమంత సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉన్నా.. తన కుటుంబం గురించిన విశేషాలను తక్కువగానే పంచుకునేది. ప్రస్తుతం సిటాడెల్ అనే వెబ్ సిరీస్ తో మరో విజయాన్ని అందుకుని ఆనందంగా ఉన్న టైమ్ లో ఆమె జీవితంలోనే అత్యంత విషాదం చోటు చేసుకోవడం బాధాకరం. సమంత తండ్రి ఆత్మకు శాంతి చేకూరాలని మనమూ కోరుకుందాం.

Tags

Next Story