Samantha: బాలిలో హాలిడే వెకేషన్.. వైరల్ అవుతున్న ఫొటోలు

Samantha: బాలిలో హాలిడే వెకేషన్.. వైరల్ అవుతున్న ఫొటోలు
X
హాలిడే వెకేషన్ ను ఎంజాయ్ చేస్తోన్న సమంత

స్టార్ హీరోయిన్లలో ఒకరైన సమంత రూత్ ప్రభు.. ఇటీవలే నటనకు విరామం ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలోనే ఆమె భారతదేశంలోని పలు ప్రాంతాలను సందర్శిస్తున్నారు. ఈ పర్యటనకు సంబంధించిన పలు ఫొటోలను కూడా ఆమె ఇప్పటికే అభిమానులతో పంచుకున్నారు. తాజాగా సమంత తన స్నేహితురాలు అనూషా స్వామితో ఎంజాయ్ చేసేందుకు ఇండోనేషియాలోని బాలికి వెళ్లారు. ఈ రోజు ఆమె తన ప్రయాణాలకు సంబంధించిన ఫొటోలను కూడా పంచుకున్నారు. ఈ ఫొటోలను చూస్తుంటే ఒత్తిడిని తగ్గించడానికి, రోజువారీ రొటీన్ పనుల నుంచి విరామం తీసుకోమని ప్రేరేపించేవిలా ఉన్నాయి.

సమంతా బాలిలో తన మార్నింగ్ వాక్ నుంచి ఫొటోలను షేర్ చేస్తూ వచ్చారు. "ఇలాంటి ఉదయాలు [వైట్ హార్ట్ ఎమోజి]" అనే క్యాప్షన్ తో వీటిని ఆమె పోస్ట్ చేశారు. మొదటి ఫొటోలో సమంతా తెల్లటి లేస్-ఎంబ్రాయిడరీ డ్రెస్సులో కనిపించారు. ఉదయపు నడకలో భాగంగా ఆమె పచ్చని ప్రకృతిని ఎంజాయ్ చేయడం ఇందులో కనిపిస్తోంది.


గడ్డితో చేసిన టోపీ ధరించిన సమంత.. క్లోజ్-అప్ చిత్రాన్ని కూడా షేర్ చేశారు. ఇందులో ఆమె మినీ-లెంగ్త్ జంప్‌సూట్‌తో స్టైల్ గా కనిపించారు. లేత గోధుమరంగు యాక్సెసరీలో నలుపు రంగు రిబ్బన్ ధరించి ఉండగా.. టోపీపై 'డ్రీమ్ ఆన్' అనే పదం ఎంబ్రాయిడరీతో చేయబడి ఉంది.

బాలీలోని సుందరమైన దృశ్యాల ఫొటోలను కూడా సమంత సమంత తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీగా పోస్ట్ చేశారు. మొదటి చిత్రంలో సమంతా తన మార్నింగ్ వాక్ సమయంలో గ్రామీణ ప్రాంతంలో తీసిన వీడియో కాగా.. రెండవది ఆమె, ఆమె స్నేహితురాలు ఆర్డర్ చేసిన పానీయాలకు సంబంధించింది. ఇక మూడవ క్లిక్ బీచ్‌లో అందమైన సూర్యోదయాన్ని చూపిస్తోంది.


బాలి దాని పచ్చని ప్రకృతి దృశ్యాలు, ఆహ్లాదకరమైన వాతావరణానికి ప్రసిద్ధి చెందింది, సమంతా వీటికి సంబంధించిన చిత్రాలనే షేర్ చేశారు. అంతకుముందు, సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త హెయిర్‌కట్‌కు సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు. కెమెరాను చూసి నవ్వుతూ, తన కొత్త హెయిర్‌కట్‌ను ప్రదర్శిస్తున్న ఈ వీడియో కూడా ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఆమె తన జుట్టును చిన్నగా కత్తిరించుకున్నట్టు తెలుస్తోంది. ప్రశాంతమైన తన ముఖంలో చిరునవ్వులు చిందిస్తూ ఇలా అలరించింది.

సమంతా రూత్ ప్రభు ప్రస్తుతం తన ఆరోగ్యంపై దృష్టి పెట్టారు. ఆటో ఇమ్యూన్ కండిషన్ మైయోసైటిస్‌కు చికిత్స చేయించుకునేందుకే ఆమె నటనకు విరామం ఇచ్చారు. ఇటీవల వెబ్ సిరీస్ 'సిటాడెల్' షూటింగ్ పూర్తి చేసిన సమంత.. రౌడీ హీరో విజయ్ దేవరకొండతో ఆమె 'ఖుషీ'లోనూ నటిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 1న విడుదల కానుంది.


Tags

Next Story