Samantha’s Latest Comment : విడాకులు, ఆరోగ్యం, ట్రోల్స్ పై సామ్ ఏమందంటే..
సినీ పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన నటీమణులలో సమంత రూత్ ప్రభు ఒకరు. ఆమె తన నటనా నైపుణ్యం, రూపానికి ప్రసిద్ధి చెందింది. సోషల్ మీడియాలోనూ భారీ అభిమానులను పొందిన ఈ టాలీవుడ్ హీరోయిన్.. నాలుగు ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్‌తో సహా అనేక ప్రశంసలను గెలుచుకుంది. 2010లో 'ఏ మాయ చేసావే' అనే తెలుగు సినిమాతో తెరంగేట్రం చేసిన ఆమె ఆ తర్వాత విభిన్న చిత్రాల్లో నటించి, ఎన్నో పేరు, ప్రఖ్యాతలు దక్కించుకుంది.
సమంత తన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితం రెండింటి కారణంగా గత కొన్ని సంవత్సరాలుగా వార్తల్లో నిలుస్తోన్న సంగతి తెలిసిందే. సమంతా ఫ్లాప్ సినిమాలు, మ్యారేజ్ ఫెయిల్యూర్, మైయోసిటిస్ అనే ఆటో-ఇమ్యూన్ కండిషన్ తో పాటు మరిన్నింటిని ఎదుర్కొంటూ జీవితంలో అనేక సవాళ్లను అధిగమిస్తోంది. టాలీవుడ్ హీరో నాగ చైతన్యను వివాహం చేసుకున్న సమంత.. అక్టోబర్ 2021లో విడాకులతో ముగిసిపోయింది.
అయితే హార్పర్స్ బజార్‌కి సమంత ఇచ్చిన తన తాజా ఇంటర్వ్యూలో, సమంత తన 'విఫలమైన వివాహం' గురించి రేర్ కామెంట్స్ చేసింది. “నేను ఆల్ టైమ్ లో లెవల్ కి చేరుకున్నప్పుడు, మ్యారేజ్ ఫెయిల్ కావడం, నా ఆరోగ్యం, పని దెబ్బతింటుంటే, అది ట్రిపుల్ వామ్మీ లాంటిది; బూమ్, బూమ్, బూమ్. మీకు తెలుసా, గత రెండు సంవత్సరాలుగా నేను భరించిన దానికంటే చాలా తక్కువకే ప్రజలు దిగజారుతున్నారు అని చెప్పింది. తాను మైయోసైటిస్‌తో బాధపడుతున్నప్పుడు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న నటీనటుల గురించి కూడా తాను తెలుసుకునేదాన్నని సామ్ చెప్పింది. ట్రోల్స్, ఆందోళనలను ఎదుర్కొన్న సెలబ్రిటీల గురించి కూడా తాను తెలుసుకునేదాన్నని ఆమె చెప్పింది. ఇతరుల గురించి తెలుసుకోవడం అనేది తాను తిరిగి పుంజుకోవడానికి సహాయపడిందని, తాను ఇప్పటికీ ఆశ కోల్పోలేదని సామ్ తెలిపింది.
”ఈ దేశంలో ప్రియమైన స్టార్‌గా ఉండటం ఒక అద్భుతమైన బహుమతి అని గుర్తించడం చాలా ముఖ్యం; కాబట్టి దానికి బాధ్యత వహించండి, నిజాయితీగా, వాస్తవికంగా ఉండండి. మీ స్టోరీని చెప్పండి. ఎవరైనా ఎన్ని సూపర్ హిట్‌లు, బ్లాక్‌బస్టర్‌లను కలిగి ఉన్నారు, ఎన్ని అవార్డులు గెలుచుకున్నారు, పరిపూర్ణమైన శరీరం లేదా అత్యంత అందమైన దుస్తుల గురించి కాదు. ఇది బాధ, కష్టాలు, సమస్యలు. నా సమస్యలు చాలా పబ్లిక్‌గా ఉన్నాయని నేనేం పట్టించుకోను. ఇలాంటి పరిస్థితిలో ఉన్న వ్యక్తులు కూడా పోరాడుతూనే ఉండే శక్తిని కలిగి ఉంటారని నేను ఆశిస్తున్నానని సామ్ చెప్పింది.
2019, 2020లో టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్‌లలో సమంత వరుసగా 17వ , 34వ ర్యాంక్‌లను పొందారు. ఆ తర్వాత వరుణ్ ధావన్ సరసన సిటాడెల్ అనే భారతీయ అనుసరణలో కనిపించనుంది. ప్రస్తుతం సౌత్ ఇండియాలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటిగా ఆమె రెండో స్థానంలో ఉంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com