Samantha : చైతన్య, శోభిత పెళ్లిపై సమంత లేటెస్ట్ రియాక్షన్

Samantha :  చైతన్య, శోభిత పెళ్లిపై సమంత లేటెస్ట్ రియాక్షన్
X

ఇండియాస్ మోస్ట్ లవబుల్ కపుల్ అని ఎవరైనా అనిపించుకున్నారంటే అది నాగ చైతన్య, సమంతనే. బట్ అలాంటి లవబుల్ కపుల్ మధ్య కూడా సమస్యలు వచ్చాయి. విడిపోయారు. ఎవరి జీవితం వారిదే. కానీ ఈ కపుల్ కు ఉన్న క్రేజ్ మాత్రం ఇంకా తగ్గలేదు. చివరికి నాగ చైతన్య లైఫ్ లో మూవ్ ఆన్ అయిపోయి నటి శోభిత ధూళిపాలను పెళ్లి చేసుకున్న తర్వాత కూడా అటు చైతూనో ఇటు సమంతనో వారి పాస్ట్ లైఫ్ గురించి ప్రశ్నలు వేస్తుంటారు. ఓ రకంగా ఇది మానర్స్ కాకపోయినా సెలబ్రిటీస్ కాబట్టి వారికి తప్పడం లేదేమో. అలా తాజాగా చైతన్య, శోభితను పెళ్లి చేసుకోవడంపై జెలసీ ఫీలవుతున్నారా అని సమంతను అడిగారు కొందరు మీడియా వాళ్లు.

దానికి సమంత.. ’నా లైఫ్ లో అసూయకు స్థానం లేదు. అన్ని సమస్యలకు జెలసీనే కారణం అని నమ్ముతాను నేను. నా లైఫ్ లో అలాంటి వాటికి చోటే లేదు. నేను దేని గురించీ పట్టించుకోను’అని బదులిచ్చింది. నిజానికి విడిపోయిన తర్వాత ఎదురయ్యే రకరకాల ప్రశ్నలకు ఈ ఇద్దరూ హుందాగానే సమాధానం చెబుతూ వస్తున్నారు. ఎప్పుడూ అవతలి వ్యక్తి గురించి తక్కువగా మాట్లాడిందే లేదు. అయినా పదే పదే వారి పాత జీవితం గురించి అడగడం కూడా భావ్యం కాదేమో.

మరోవైపు సమంత కూడా తనతో ద ఫ్యామిలీ మేన్ ౨, సిటాడెల్ సిరీస్ లు రూపొందించిన దర్శక ద్వయంలో ఒకరైన రాజ్ తో మళ్లీ ప్రేమలో పడిందనే వార్తలు వస్తున్నాయి. కొన్నాళ్లుగా ఇద్దరూ పబ్లిక్ గానే కనిపిస్తున్నారు. విషయం చెప్పడం లేదు కానీ.. సమంత కూడా తన లైఫ్ కు మరో పార్టనర్ ను వెదుక్కుందని.. అది రాజ్ అనే వార్తలు విపరీతంగా వస్తున్నాయి. మరి నిజమేంటో కొన్ని రోజుల్లో అందరికీ తెలిసిపోతుంది కదా.

Tags

Next Story