Samantha: ఫ్యాన్స్‌కు సమంత సర్‌ప్రైజ్.. నెగటివ్ రోల్‌లో..

Samantha: ఏ పాత్రనైనా అవలీలగా చేసేస్తుంది. అందుకే అంతమంది అభిమానులను సంపాదించుకుంది. టాలీవుడ్, కోలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న సమంతకు బాలీవుడ్, హాలీవుడ్ సినిమాల్లో నటించే ఛాన్స్ వచ్చింది. అటు వెబ్‌సిరీస్‌లోనూ నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఆమె చేసిన రెండు ప్రాజెక్టులు శాకుంతలం, యశోద రిలీజ్ కావలసి ఉంది. విజయ్ దేవరకొండతో ఖుషి చిత్రాన్ని పూర్తి చేస్తోంది. తాజాగా కోలీవుడ్‌లో విజయ్‌తో చేసే చిత్రంకోసం మేకర్స్ సమంతను సంప్రదించినట్లు తెలిసింది.
యూనివర్సల్ హీరో కమల్ హాసన్ యాక్షన్ ఎంటర్ టైనర్ విక్రమ్‌తో దర్శకుడు లోకేష్ కనగరాజ్ సంచలనం సృష్టించాడు. ఫహద్ ఫాసిల్, విజయ్ సేతుపతి జంటగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. ఇప్పుడు అందరి దృష్టి అతని తదుపరి చిత్రంపై ఉంది. ఈసారి దళపతి విజయ్‌తో చిత్రాన్ని తీయనున్నట్లు తెలుస్తోంది. లోకేష్ ఈ ప్రాజెక్ట్ ప్రకటించినప్పటి నుండి ప్రేక్షకుల్లో ఉత్కంఠ పెరుగుతోంది.
సమంతను కథానాయికగా తీసుకోవాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు . ఈ సినిమాలో విజయ్‌ను సమంత సర్ ప్రైజ్ చేయనున్నట్టు ఇన్‌సైడ్ టాక్. ఈ చిత్రంలో సమంత మహిళా ప్రధాన పాత్రలో కాకుండా శక్తివంతమైన ప్రతికూల పాత్రలో కనిపిస్తుంది. ఇది ఆమె అభిమానులను మరియు సినీ ప్రేమికులను ఆశ్చర్యపరుస్తుంది. ఈ చిత్రం గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్‌లో ఉందని, యూనివర్సల్ అప్పీల్ కోసం లోకేష్ కనగరాజ్ ముంబై బ్యాక్‌డ్రాప్‌ను సెట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు వినికిడి.
Samantha's negative role in Vijay's 67ఈ చిత్రంలో విజయ్ గ్యాంగ్‌స్టర్‌గా పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నాడు. సమంత , విజయ్‌ల గొడవను బుల్లితెరపై చూసేందుకు సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com