విడాకులు తీసుకోమని సమంతకు సూచించింది ఈవిడేనట..! వైరల్ పోస్ట్

విడాకులు తీసుకోమని సమంతకు సూచించింది ఈవిడేనట..! వైరల్ పోస్ట్

టాలీవుడ్ లో అందరికీ షాకిచ్చిన బ్రేకప్ అంటే నాగచైతన్య,సమంతదే. అసలు ఏం జరిగింది.. ఎందుకు విడిపోయారు అనేదానిపై రకరకాల కథనాలు ఉన్నా కూడా ఇప్పటికీ మిస్టరీనే. మంచి కపుల్, బాగుంటారు అనుకున్న జంటను విడగొట్టింది ఎవరు.. ఎవరు సలహాలు ఇచ్చారనేదానిపై ఒక న్యూస్ వైరల్ అవుతోంది. అదేంటో తెలుసుకుందాం.

'ఏ మాయ చేశావే' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సమంత.. అదే సమయంలో నాగచైతన్యతో ప్రేమలో పడింది. ఏడేళ్లు ప్రేమించుకున్న ఈ ఇద్దరు.. పెద్దల అంగీకారంతో 2017లో పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. తర్వాత కొన్ని అనివార్య కార్యణాల చేత 2021లో విడిపోతున్నట్లు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చి ఫ్యాన్స్‌ను షాక్‌కు గురిచేశారు. వీళ్లిద్దరూ విడిపోవడానికి వీళ్లే కారణమంటూ కొంత మంది పేర్లు తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. అందులో సమంత ఫ్రెండ్ మేఘన వినోద్ పేరు కూడా ఒకటి. ఈ క్రమంలోనే తాజాగా సమంత మేఘనాతొ ఉన్న ఫొటోను షేర్ చేస్తూ.. 'నేను తీసుకున్న మంచి నిర్ణయాలకు ఫేస్ పెడితే మేఘన' అంటూ క్యాప్షన్ ఇచ్చింది.

ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ కావడంతో.. సమంత, నాగచైతన్య విడాకులు ఇష్యూ మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చింది. సమంత ఆ మధ్య మయోసైటిస్ బారిన పడి కోలుకుంది. ప్రస్తుతం సినిమాలకు రీ ఎంట్రీ ఇచ్చినట్లు కూడా తెలుస్తోంది. ఇప్పుడైతే హాలీవుడ్ స్థాయి వెబ్ సిరీస్ లలో గ్లామర్ డోస్ పెంచి జోరు చూపించేందుకు రెడీ అయింది.

Tags

Read MoreRead Less
Next Story