The Family Man Web Series : సమంత తగ్గేదేలే.. ఓటీటీ లోనూ పది కోట్ల పారితోషికం

టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో హీరోయిన్ సమంత (Samantha) ఒకరు. కేవలం తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో క్రేజ్ సంపాదించుకుంది ఈ బ్యూటీ. ఫ్యామిలీ మాన్ వెబ్ సిరీస్ తో (Family Man Webseries) బాలీవుడ్ లోనూ (Bollywood) అభిమానులను సొంతం చేసుకుంది. కొంతకాలం క్రితం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న సమంత.. ఆరోగ్య సమస్యల కారణంగా కొన్ని రోజుల పాటు సినిమాలకు విరామం ఇవ్వాల్సి వచ్చింది. గతేడాది శాకుంతలం, ఖుషి చిత్రాలలో ప్రేక్షకులను ఈ అమ్మడు అలరించింది.
ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ తో ఓటీలోకి అడుగుపెట్టిన సమంత.. మనోజ్ బాజ్పేయితో కలిసి ఇందులో నటించింది. అనంతరం పలు ఓటీటీ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. రీసెంట్ ఈమె నటించిన సిటాడెల్ అనే ఓ సిరీస్ విడుదలకు సిద్ధంగా ఉంది. రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సిరీస్ లో వరుణ్ ధావన్ హీరోగా నటించాడు. హాలీవుడ్ లో ప్రియాంక చోప్రా చేసిన సిటాడెల్ కి రీమేక్ గా ఇండియన్ వర్షన్ లో ఈ వెబ్ సిరీస్ రూపుదిద్దుకుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.
ఇక సినిమా కోసం ఏకంగా రూ.10 కోట్లు వసూలు చేసిందట సమంత. ప్రస్తుతం టాలీవుడ్ లో ఏ హీరోయిన్ఇంత మొత్తం రెమ్యూనరేషన్ అందుకోకపోవడం గమనార్హం.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com