సినిమా

Aryan Khan Drugs Case: ఆర్యన్ ఖాన్ కేసులో ఏం జరుగుతోంది.? వాంఖడేను ఎందుకు తప్పించారు..?

Aryan Khan Drugs Case: ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో కీలకంగా వ్యవహరించిన ఎన్‌సీబీ జోనల్‌ డైరెక్టర్‌ సమీర్ వాంఖడేను బదిలీ.

Aryan Khan Drugs Case: ఆర్యన్ ఖాన్ కేసులో ఏం జరుగుతోంది.? వాంఖడేను ఎందుకు తప్పించారు..?
X

Aryan Khan Drugs Case: ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో కీలకంగా వ్యవహరించిన ఎన్‌సీబీ జోనల్‌ డైరెక్టర్‌ సమీర్ వాంఖడేపై అవినీతి ఆరోపణలు రావడంతో ఎన్సీబీ సెంట్రల్‌ జోన్‌కు బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈకేసుకు సంబంధించి ప్రత్యేక సిట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాక వాంఖడే దర్యాప్తు చేస్తున్న మరో ఐదు కేసుల నుంచి అతనిని తొలగించారు.

ఆర్యన్‌ అరెస్ట్‌లో వాంఖడే కుట్రపూరితంగా వ్యవహరించారంటూ మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ తీవ్ర ఆరోపణలు చేశారు. వాంఖడే డబ్బు డిమాండ్ చేశారని సంచలన ఆరోపణలు చేశారు. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకున్న ఎన్సీబీ సంస్థ వాంఖడేపై విచారణ జరుపుతోంది. ఇదిలా ఉండగా.. బాలీవుడ్ స్టార్‌ షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ శుక్రవారం ఎన్‌సీబీ ముందు విచారణకు హాజరయ్యాడు.

డ్రగ్స్‌ కేసులో ఆర్యన్‌ ఇటీవలే బెయిల్‌ పొందాడు. హైకోర్టు ఆదేశాలతో ఆర్యన్‌ ప్రతి శుక్రవారం ఎన్సీబీ విచారణకు అటెండ్‌ కావాల్సి ఉండటంతో.. ఈ రోజు మధ్యాహ్నం ఎన్సీబీ కార్యాలయానికి వచ్చాడు. అక్టోబర్ నెల ప్రారంభంలో ముంబయిలోని క్రూజ్ నౌక డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ అరెస్ట అయ్యాడు. ఆతర్వాత బెయిల్‌ కోసం ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ ప్రత్యేక న్యాయస్థానం నిరాకరించింది.

చివరకు బాంబే హైకోర్టును ఆశ్రయించగా.. మూడు రోజుల వాదనల అనంతరం బెయిల్‌ దక్కింది. అయితే ఆ సమయంలో కోర్టు ఆర్యన్‌కు 14 షరతులు విధించింది. ప్రతి శుక్రవారం ఎన్‌సీబీ కార్యాలయంలో ఉదయం 11గంటలు - మధ్యాహ్నం 2గంటల మధ్య హాజరు కావడం అందులో ఒకటి. దానిలో భాగంగా అతడు ఈ రోజు ఎన్‌సీబీ కార్యాలయానికి వచ్చాడు.

Divya Reddy

Divya Reddy

TV5 News Desk


Next Story

RELATED STORIES