ఫిట్‌నెస్ ఫ్రైడే.. నెలకు రెండు కిలోలు బరువు తగ్గాను: సమీరా రెడ్డి

ఫిట్‌నెస్ ఫ్రైడే.. నెలకు రెండు కిలోలు బరువు తగ్గాను: సమీరా రెడ్డి
రోజుకు 16 గంటలు ఉపవాసం.. ప్రతి శుక్రవారం నా బరువును మీకు చెప్పాలనుకుంటున్నాను.

అడ్డు అదుపు లేకుండా బాడీ పెరిగి పోతుంటే ఏం చేయలేని పరిస్థితి.. ఫుడ్ కంట్రోల్ చేద్దామంటే జిహ్వచాపల్యం చంపుకోలేకపోతారు. సన్నగా, స్లిమ్‌గా ఉన్నవారిని చూసి రేపట్నుంచి బరువు తగ్గే ప్రయత్నాలు మొదలు పెట్టాలనుకుంటారు. కానీ అంతలోనే బద్దకం.. ఏం చేసినా ఇంతే అని నిరుత్సాహం.. వెరసి మరికొంత బరువు పెరగడానికి ఆస్కారం అవుతుంది.

కానీ బరువు తగ్గాలని గట్టిగా నిర్ణయించుకోవాలి.. దాని కోసం నిబద్దతగా కష్టపడాలంటోంది ఒకనాటి అందాల భామ సమీరా రెడ్డి. ఇద్దరు పిల్లల తల్లైన తనకి ఫుడ్ క్రేవింగ్ ఎక్కువే నని చెబుతోంది. దాంతో ఒక్కసారిగా 92 కిలోల బరువు పెరిగిపోయానని చెప్పుకొచ్చింది. అయితే బరువు తగ్గే మార్గం మన చేతిలోనే ఉందని ఫిట్‌నెస్ ఎక్స్‌ర్‌సైజులు మొదలు పెట్టిందట. దాంతో 42 ఏళ్ల సమీర నెల రోజులకే రెండు కిలోల బరువు తగ్గిందట.

తన ఫిట్‌నెస్ ప్రయాణాన్ని వివరిస్తూ, తన దినచర్యను పంచుకున్న రెడ్డి - సైక్లింగ్, బ్యాడ్మింటన్, యోగా వంటి శారీరక శ్రమను కలిగించే ఎక్సర్‌సైజ్‌లన్నీ చేస్తానని తెలిపింది. ఏవో సాకులు చూపించి ఎక్సర్‌సైజ్‌లు చేయడం మానేయనని చెప్పింది. రోజుకు 16 గంటలు ఉపవాసం ఉండి 8 గంటల్లో ఏదో ఒకటి తింటాను అని పేర్కొంది. మరియు తీసుకునే ఆహారపు అలవాట్లపై దృష్టి పెట్టాలి. ప్రతి శుక్రవారం నా బరువును మీకు చెప్పాలనుకుంటున్నాను. మీరు కూడా నాతో కలిసి ప్రయాణం చేయండి. ఎక్కువగా ఉన్న మీ బాడీ వెయిట్‌ని తగ్గించుకోవడానికి ప్రయత్నించండి అని చెబుతోంది.

Tags

Read MoreRead Less
Next Story